Breaking News

ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఎస్పీ లేవెన్ పై కలెక్టర్ లేవెన్ విజయం

-ఈ విజయం టీమ్ తూర్పు గోదావరి విజయం.. ఇరువురం విజేతలే.. కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుధీర్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిరోజూ అధికారులు, పోలీసులు ఎన్నో వత్తిడుల మధ్యప్రతి నిత్యం ఉంటూ ప్రజలకు ప్రభుత్వా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యడం, అటువంటి వత్తిడి నుంచి దూరం చేసి కొంత ఆటవిడుపు చెయ్యాలనే ఆలోచన తో ఎస్పీ సుదీర్ కుమార్ తో కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం  జీ ఎస్ ఎల్ మైదానంలో కలెక్టర్ వెర్సెస్ ఎస్పీ టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ 20 – 20 పోటీ సందర్భంగా టాస్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి కావస్తున్నదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అధికారులు మంచి టీమ్ వర్క్స్ తో కలిసి అడుగులు వెయ్యడం జరుగుతోందని అన్నారు. గత ఏడాది కాలంలో ఎన్నో కార్యక్రమాలను టీమ్ వర్క్ గా విజయవంతంగా చేపట్టి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. వత్తిడి ని అధిగమించేందుకు ఇటువంటి స్నేహపూర్వక వాతావరణం లో క్రీడాల నిర్వహణ కూడా ఎంతో దోహదం చేస్తాయని అంటూ కలెక్టర్ మాధవీలత ఇరు టీమ్ లకు “ఆల్ ది బెస్ట్” చెప్పారు.

అనంతరం జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇరు బృందాలకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ఇటువంటి స్నేహ పూర్వక మ్యాచ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ ను ఎస్పీ అభినందించారు.

మ్యాచ్ అనంతరం జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ విజేత లైన కలెక్టర్ 11 టీమ్ కు విన్నర్ ప్రైజ్ ట్రోఫీ,, రన్నర్ అప్ టీమ్ ఎస్పీ 11 టీమ్ కు రన్నార్ అప్ ట్రోఫీ అందచేశారు. పోటీ నిర్వహణ సజావుగా సాగడానికి సహకరించిన జీ ఎస్ ఎల్ యాజమాన్యం చైర్మన్ డా . గన్నీ భాస్కర్ రావు, వారి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఎస్పీ వెర్సెస్ కలెక్టర్ టీమ్ లోని సభ్యులు పట్టుదలతో మ్యాచ్ ఆడటం జరిగిందని, ఇటువంటి క్రీడల్లో గెలుపు మనందరిది అని అన్నారు. మ్యాచ్ నిర్వహణ కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

తొలుత టాస్ గెలిచిన కలెక్టర్ మాధవీలత బౌలింగ్ ఎంచుకుని, ఎస్పీ టీమ్ ను బ్యాంటిగ్ కు ఆహ్వానించడం జరిగింది. ఎస్పీ సుధీర్ కుమార్ నేతృత్వంలోని ఎస్పీ 11 టీమ్ నిర్ణీత 20 లకు 19.1 ఓవర్ల లో 97 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన కె. దినేష్ కుమార్ ఐ ఎ ఎస్ నేతృత్వం లోని కలెక్టర్ 11 టీమ్ 11.3 ఓవర్ల లో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 101 లను సాధించడం ద్వారా 4 పరుగులు, 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. కలెక్టర్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ 31 పరుగులు సాధించి బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ అవార్డు ను ఎస్పీ చేతుల మీదుగా గెలుచుకున్నారు. విజేత ట్రోఫీ ని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టర్ 11 టీమ్ దినేష్ కుమార్ నేతృత్వంలోని సభ్యులు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క క్రీడాకారులకు విన్నర్, రన్నర్ మేమొంటో లను బహూకరించారు.

స్కోర్ వివరాలు (ఎదుర్కొన్న బంతులు)

ఎస్పీ లేవెన్ : సిహెచ్. సుధీర్ కుమార్ 1(10) ; మోహన్ 2(4) ; అశోక్ 9(15) ; దినేష్ 12(23) ; మూర్తి 7(11) ; వసు వర 5(10) ; వరహాలు 22 (18) ; కే. రత్నం 5(5) ; మధు 8(10); రవీంద్రబాబు 3(6) ; నారాయణ రావు 1(3) నాటవుట్
ఎక్స్ ట్రాలు 22 ( వైడ్ 10; ఎల్ బి 6, బైస్ 6)
మొత్తం స్కోర్ 19.1 ఓవర్ల లో 97/10

బౌలింగ్ (కలెక్టర్ 11)
( బౌలర్ ఓవర్లు – పరుగులు- వికెట్లు)
వేణు మణికంఠ (4-14-1)
కార్తికేయ రెడ్డి (3.1- 11 – 3)
నాగేంద్ర (4-13-0)
అరవింద్ (4-20-3)
కోన శ్రీను (4-27-2)

కలెక్టర్ లేవెన్  : అజయ్ 12 (10) ; కే. దినేష్ కుమార్ (ias) 31 (28) ;  అరవింద్ 34 (26) నాటౌట్ ; జీ.బాపిరాజు 9(5)   నాటౌట్ ( వైడ్ 10 ; బైస్ 4 ) మొత్తం స్కోర్ 11.3 ఓవర్ల లో 101/2

బౌలింగ్ (ఎస్పీ 11)
( బౌలర్ ఓవర్లు – పరుగులు- వికెట్లు)
మూర్తి (2-15-0 )
మోహన్ (2- 18-1)
వసు వర (1-5-0)
దినేష్ (1-11-0)
మధు (2-17-0)
నారాయణ రావు (2.3-25-1)
రవీంద్రబాబు (1-6-0)

లెగ్ఇంజరి తో పోలీస్ టీమ్ ను ప్రోత్సహించడం కోసం ఎస్పీ సుధీర్ కుమార్ ముందుండి టీమ్ కోసం బ్యాంటింగ్ చెయ్యడం జరిగింది. తదుపరి ఫీల్డింగ్ లో పాల్గొనడం జరగలేదు. ఎస్పీ ఎలెవన్ లో అండర్.19 యువ మహిళా క్రీడాకారిణి వికెట్ కీపర్ గా వ్యవరించడం గమనార్హం.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అరవింద్ (కలెక్టర్ టీమ్ )బెస్ట్ బ్యాట్స్ మ్యాన్గా కే. దినేష్ కుమార్ (కలెక్టర్ టీమ్)
బేస్ట్ ఫీల్డర్ గా దినేష్ (ఎస్పీ టీమ్)
బెస్ట్ బౌలర్ గా కార్తికేయ రెడ్డి (కలెక్టర్ టీమ్)

ఈమ్యాచ్ కి ఎంపైర్ గా (స్టేట్ ప్యానల్ ఎంపైర్) హరీ వారి టీమ్ వ్యవహరించడం జరిగింది.

జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, ఆర్డీవో ఏ. చైత్రవర్షిని, ఎస్. మల్లి బాబు, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు ఎం ఎం శేష గిరి టీమ్, తహశీల్దార్లు, ఇతర అధికారులు, జి ఎస్ ఎల్ సిబ్బంది సహకారం తో నిర్వహించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *