-రెండు కోట్లకు పైగా అమ్మకాలు..
-ఎమ్మెల్సీ ఎం. హనుమంతరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత వస్త్ర ప్రదర్శన వస్త్రాభిమాని విశేషంగా ఆకట్టుకుందని, ఈ ప్రదర్శన ద్వారా రెండు కోట్లకు పైగా అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమని శాసనమండలి సభ్యులు ఎం. హనుమంతరావు అన్నారు.
నగరంలోని సిద్దార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో 15రోజుల పాటు నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాసనమండలి సభ్యులు ఎం హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చేనేత జోలి శాఖ, చేనేత కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శన వస్త్రాభిమానులను విశేషంగా ఆకట్టుకుందని, ఈ ప్రదర్శన ద్వారా రెండు కోట్ల కు పైగా అమ్మకాలు నిర్వహించడం పట్ల శాసనమండలి సభ్యులు ఎం హనుమంతరావు ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం, ఉప్పాడ,పెద్దాపురం, వెంకటగిరి, మంగళగిరి, చీరలు డ్రసెమెటీరియల్ పొందూరు ఖదర్, తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి గద్వాల్ నారాయణపేట, పట్టు చీరలు, హుజురాబాద్ కరీంనగర్ దుప్పట్లు, తమిళనాడులోని కంచి, మదురై పట్ట చీరలు, సేలం కాటన్ చీరలు, చెన్నిమలై దుప్పట్లు, బెంగాలీ కాటన్ చీరలు, మధ్య ప్రదేశ్ కు చెందిన చందేరి మహేశ్వరి చీరలు డ్రసెమెటిరియల్స్, ఉత్తర ప్రదేశ్ డిల్లీ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు వస్త్రాభిమానులను విశేషంగా అకట్టుకొని రెండు కోట్లకు పైగా అమ్మకాలు జరిపారని అన్నారు.
వస్త్రాభిమానులు ప్రదర్శనను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయడం ద్వారా చేనేత కళాకారులను ప్రోత్సహించారని శాసనమండలి సభ్యులు హనుమంతరావు అన్నారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎస్. రఘునంద ఉన్నారు.