Breaking News

శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం ప్రత్యేకమైన ప్యాకేజి

-రోజూ 1075 దర్శనం టిక్కెట్లు
-ఫిబ్రవరి 9 నుండి అమలు
-ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన APSRTC
-పుణ్యక్షేత్రాలకు అవాంతరం లేని దర్శనానికి శ్రీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలం వెళ్ళే భక్తులు, ప్రయాణికులు, యాత్రికుల కోసం APSRTC ఎటువంటి అవాంతరం లేని దర్శనం కల్పించనున్నది. ఈ ఆకర్షణీయమైన ప్యాకేజీ 2023, ఫిబ్రవరి 9 నుండి అమలులోకి రానున్నది.
ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతూ APSRTC ముందంజలో ఉంది. ఇదే కోవలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తులు, యాత్రికుల కోసం సులభతరమైన ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఆయా ఆలయాల దర్శనం కూడా సజావుగా సాగేలా ఎన్నో చర్యలు తీసుకుంటూ ప్రయాణీకుల మెప్పు పొందింది. దేవాదాయ శాఖ సమన్వయంతో శ్రీశైలం దర్శించే భక్తుల కోసం సరికొత్త ప్యాకేజిని APSRTC ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది.
APSRTC బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లతో పాటు 1,000 శీఘ్ర దర్శన టిక్కెట్లు ఇప్పటికే APSRTC అందిస్తోంది. అదేవిధంగా ప్రముఖ దేవాలయమైన శ్రీశైలం వెళ్ళే ప్రయాణీకుల కోసం ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లతో పాటు స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం కల్పించబోతుంది.
శ్రీశైలం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి. ప్రయాణీకులు, భక్తులు ఈ ఆలయానికి వెళ్లడానికి ఎటువంటి ఇబ్బంది లేని దర్శనాన్ని పొందాలనుకుంటున్నారు.
దేవాదాయ శాఖ ద్వారా వచ్చే యాత్రికులకు స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శన సౌకర్యాలు కల్పిస్తారు. అయితే ఈ రోజు వరకూ కూడా ఇలా సందర్శించే భక్తులు ఆలయ కౌంటర్లో లేదా దేవస్థానం వెబ్సైట్ ద్వారా దర్శన టిక్కెట్ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాగా, ఇప్పుడు APSRTC బస్సుల్లో శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు ప్రతి రోజూ 1075 దర్శనం టిక్కెట్లు కేటాయించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం తెలిపారు. దీనితో APSRTC బస్సులలో ప్రయాణించే భక్తులు తమ దర్శన టికెట్తో పాటు APSRTC వెబ్సైట్ ద్వారా లేదా బస్సు లోపల ఈ దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆ విధంగా భక్తులు తన ప్రయాణ టిక్కెట్ను బుక్ చేసుకుంటూనే, శ్రీశైలంలో ప్రత్యేక దర్శనానికి హామీ పొందవచ్చు.
APSRTC రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలానికి ప్రతిరోజూ 95 సర్వీసులను నడుపుతోంది. ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వివిధ దేవాలయాలను దర్శించే నేపధ్యంలో 9 ఫిబ్రవరి, 2023 నుండి APSRTC బస్సుల ద్వారా శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ టిక్కెట్లతో పాటు స్పర్శ దర్శన టిక్కెట్లు, శీఘ్ర దర్శనం మరియు అతి శీఘ్ర దర్శనం టిక్కెట్లు అందించడానికి ఇప్పుడు శ్రీశైలం సౌకర్యాన్ని ప్రవేశపెడుతోంది. ప్రయాణానికి 15 రోజులు ముందుగానే ఈ టికెట్లు బుక్ చేసుకొనవచ్చును. కనిష్టంగా ఒకరోజు ముందు వరకు ఈ అడ్వాన్స్ టికెట్లు APSRTC పోర్టల్ ద్వారా బుక్ చేసుకొనవచ్చును.
ప్రయాణీకులు, భక్తులు రూ.1,075/- లతో శ్రీశైలం దర్శనం టిక్కెట్లు పొందవచ్చు (275 స్పర్శ దర్శనం టిక్కెట్లు @ రూ . 500/- ఒక్కొక్కటి + 300 అతి శీఘ్ర దర్శనం టిక్కెట్లు @ రూ. 300/- ఒక్కొక్కటి + 500 శీఘ్ర దర్శనం టిక్కెట్లు @ రూ. 150/- ఒక్కొక్కటి) ప్రతిరోజూ శ్రీశైలానికి ముందస్తు రిజర్వేషన్తో బస్ టిక్కెట్లు పొందవచ్చు. ప్రత్యేకంగా నియమించిన ఆర్టీసీ సిబ్బంది యాత్రికులకు ఇబ్బంది లేని దర్శనానికి సహకరిస్తారు .
APSRTC మరియు దేవాదాయ శాఖ అందించిన ఈ శ్రీశైల దర్శన సౌకర్యం, APSRTC బస్సులలో ప్రయాణించడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరడమైనది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *