తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనమండలి ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ అధకారులు బుధవారం సాయంత్రం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాసనమండలి ఎన్నికలు జరగనున్న జిల్లాల డిఆర్ఓ లతో, ఎన్నికల నిర్వహణపై సమీక్షించగా జిల్లా కలెక్టరేట్ నుండి డిఆర్ఓ శ్రీనివాసరావు, అర్దిఒ లు , స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు , జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న రిటైర్డ్ జెసి చంద్రమౌళి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు ఎన్నికల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన విధులను వివరించారు. ఆమేరకు రిటర్నింగ్ అధికారి, పి ఓ ల హాండ్ బుక్ లను అందించనున్నామని తెలిపారు. ప్రకటించిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ చెక్ లిస్టు ఆధారంగా పోలింగ్ ముందు రోజే చేరుకొని ఏర్పాట్ల సరిచుసుకోవాలని తెలిపారు, పోలింగ్ రోజు పోలిస్ బధ్రత , ప్రిసైడింగ్ అధికారి డైరీ నిర్వహణ , ప్రశాంత పోలింగ్ నిర్వహణ , ఓటరు గుర్తింపు కార్డుతో ఓటు హక్కు వినియోగం, సూక్ష్మ పరిశీలకుల నివేదిక , వెబ్ కాస్టింగ్ / వీడియో నిర్వహణ , పరిసరాల్లో పోలింగ్ చట్టం అమలు, పోలింగ్ ముగింపు వంటి వాటిపై వివరించి , స్థానికంగా పోలింగ్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల హాండ్ బుక్స్ ఆధారంగా అర్థమయ్యే రీతిలో మూడు సార్లు శిక్షణ ఇవ్వాల్సివుంటుందని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో రిటైర్డ్ జెసి వి. ఆర్. చంద్రమౌళి, ఆర్దిఒ లు గూడూరు కిరణ్ కుమార్ , శ్రీకాళహస్తి రామారావు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ లు శ్రీనివాసులు , టి.భాస్కర నాయుడు, తహసిల్దార్లు కుప్పయ్య, పరమేశ్వర స్వామి, అధికారులు పాల్గొన్నారు.