-పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పి.ఎం.ఈ.జి.పి రుణాలను సకాలంలో గ్రౌన్డింగ్ చేయాలని, పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి). సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కార్యక్రమం (పి.ఎం.ఈ.జి.పి.) క్రింద కే.వి.ఐ.సి. లను సమీక్షిస్తూ లక్ష్య సాధనలో పురోగతి మెరుగుపడాలని మరియు ఎల్.డి.ఎం. వాటికి అనుబంధ బ్యాంకులు లోన్లు ఇచ్చేలా సత్వరమే గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగిల్ డెస్క్ విధానంలో జిల్లా ఏర్పడిన నాటి నుండి 502 పరిశ్రమలకు గాను 465 అనుమతులు ఇచ్చామని మరో 13 పరిశీలనలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 32 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.2.198 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 29, విద్యుత్ సబ్సిడీ 1, వడ్డీ రాయితీ 1, స్టాంప్ డ్యూటీ 1 యూనిట్లకు ఆమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ఏర్పేడు మండలం మధవమాల కింద వుడ్ కార్వింగ్ క్లస్టర్, కాపర్ వేజెల్స్ క్లస్టర్ ఎర్రమరెడ్డి పాలెం, రేణిగుంట మండలం, వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డైయింగ్ క్లస్టర్ ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమలు భద్రత ప్రమాణాలు అమలు చేయాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పని సరిగా అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. పరిశ్రమలకు సంబందించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తిరుపతి, నాయుడుపేట ఏ పి ఐ ఐ సి కి సంబంధించి మొత్తం 3 పరిశ్రమల స్థాపనకు 1.10 ఎకరాలు స్థలం కేటాయింపుకు ఆమోదంతో 3.02 కోట్ల పెట్టుబడితో ప్రారంభించబడి 73 మందికి ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడా వి సి హరికృష్ణ, జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి నాయుడుపేట చంద్రశేఖర్ , తిరుపతి సుహానా సోని, లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామ కృష్ణ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ నరేంద్ర,వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.