గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలని, వార్డ్ సచివాలయాల వారిగా శానిటేషన్ కార్యదర్షులే పారిశుధ్య నిర్వహణకు పూర్తి భాద్యత వహించాలని, పనుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్లు, సెక్రెటరిలపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ రాజాగారితోట, రైల్ పేట, కొత్తపేట, బాలాజీ నగర్, పాత గుంటూరు, పొన్నూరు రోడ్, జి.టి.రోడ్, నరసరావుపేట రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న శానిటేషన్ కార్యదర్శులలో ఒకరిని విధుల నుండి సస్పెండ్ చేయాలని, మరొకరికి చార్జి మెమోస్ ఇవ్వాలని, రోడ్ల మీద కమర్షియల్ సంస్థలు వ్యర్ధాలు వేసి ఉండటం, ప్లాస్టిక్ వినియోగం పై సంబందిత టాస్క్ ఫోర్స్ బృంద సభ్యుల పై చర్యలు తీసుకోవాలని ఎం.హెచ్.ఓ.ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మణిపురం వంతెన వద్ద అపరిశుభ్రంగా ఉండటంపై రాజగారితోట పరిధిలో పారిశుధ్యం సక్రమంగా లేకపోవడం 38 వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శి నాగరాజుని విధుల నుండి సస్పెండ్ చేయాలని, 32 సచివాలయం శానిటేషన్ కార్యదర్శి కోటయ్య నాయక్ కి చార్జి మోమోస్ ఇవ్వాలని, క్రిష్ణమహల్ రోడ్ లో కమర్షియల్ సంస్థల వారు వ్యర్ధాలు రోడ్ మీద వేయడం, ప్లాస్టిక్ కవర్లు వినియోగించడంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసి, సంబందిత టాస్క్ ఫోర్స్ బృందం సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఎం.హెచ్.ఓ.ని ఆదేశించారు. సచివాలయం వారిగా పారిశుధ్య పనులు నూరు శాతం పక్కాగా జరిగేలా శానిటరీ ఇన్స్పెక్టర్, కార్యదర్శి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ పారిశుధ్య సమస్యల పై ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని, పారిశుధ్యం సక్రమంగా లేని ప్రాంతాల్లో ఆయా కార్యదర్శి, ఇన్స్పెక్టరే భాద్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణ అంటే ప్రజారోగ్య రక్షణకు కృషి చేయడమేనని, ఇందులో నిర్లక్ష్యంగా ఉండే వారి పై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెయిన్ రోడ్లను ఉదయం 7 గంటలలోపే శుభ్రం చేయించాలని, స్వీపింగ్ మెషిన్ల ద్వారా డివైడర్ పక్కన శుభ్రం చేయించాలన్నారు. శానిటరీ సూపర్వైజర్లు ప్రతి రోజు మరింత మెరుగ్గా పర్యవేక్షణ చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలుకు సిఫార్స్ చేయాలన్నారు.
పర్యటనలో ఎం.హెచ్.ఓ. డాక్టర్ భాను ప్రకాష్, ఎస్.ఎస్.లు ఆయుబ్ ఖాన్, రాంబాబు, శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …