-అధికారులకు పలు ఆదేశాలు – నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్ – 3 పరిధిలోని 4వ డివిజన్ పరిధిలోని ఎల్.ఐ.సి కాలనీ, ఫిలిం కాలనీ తదితర ప్రాంతాలలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుధ్య నిర్వహణకు ఎటువంటి అవరోధం ఏర్పడ కూడా క్లాప్ వాహనముల ద్వారా నివాసాల నుండి చెత్త సేకరణ సక్రమముగా జరుగునట్లుగా చూడాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిసరాలు అన్నియు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా డివిజన్ ఇటివల పూర్తి చేసిన సి.సి. రోడ్లను రీబౌండ్ హ్యామర్ తో పనుల యొక్క నాణ్యతను మరియు రోడ్డు యొక్క లోతు పరిమాణం నిబంధన ప్రకారం ఉన్నది లేనిది స్వయంగా పరిశీలించి వాటి యొక్క బిల్లులను తనిఖీ చేసినారు. తదుపరి జాతీయ రహదారి నందలి సెంట్రల్ డివైడర్ గ్రీనరీని పరిశీలించి మొక్కల మద్యన గల గ్యాప్ పిల్లింగ్ చేసి ఆకర్షనియంగా ఉండేలా చూడాలని అన్నారు. తదుపరి 19వ డివిజన్ పున్నమితోట ప్రాంతములో నూతనంగా ఏర్పాటు చేసిన దోభిఖానా షెడ్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్ర శేఖర్, ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఉద్యానవన అధికారి శ్రీనివాసు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.