-జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా ప్రజా పరిషత్ ఆవరణలోని కన్వెన్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంక్షేమ పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించాలని, జిల్లా అభివృద్ధిలో స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటును అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
జిల్లాలోని రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం చేయాలని ఆమె కోరారు.
గత ఏడాది నవంబర్ నెల నాలుగవ తేదీన జరిగిన చైర్ పర్సస్ సభ్యులు, సభ దృష్టికి తీసుకొని వచ్చిన వివిధ అంశములు వాటిపై జిల్లా అధికారులు తీసుకొన్న చర్యల వివరములు చైర్ పర్సన్ ఉప్పల హారిక సభ్యులందరికీ చదివి వినిపించారు.
ఆశా వర్కర్లు 60 మందికి 40 మంది మాత్రమే పని చేయుచున్నారని, గూడూరు మండలం లోని పి.హెచ్.సి ఒకటి మాత్రమే ఉన్నదని. అక్కడ డాక్టర్ల కొరత ఉన్నది కావున డాక్టర్ల కొరతపై వివరణ గూడూరు జడ్పిటిసి సంగా మధుసూదన రావు కోరారు.
ఈ విషయమై డి.ఎమ్.హెచ్,ఒ డాక్టర్ గీతా భాయి సమాధానమిస్తూ కృష్ణా : గూడూరు మండల పరిధిలో ఉన్న మల్లవోలు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య పరిధిలో ఉన్న 46,620 మంది జనాభాకు గాను 47 మంది ఆశా కార్యకర్తలను నియమించుట కొరకు: ప్రభుత్వం మంజూరు చేసి ఉన్నారని దీనిలో ప్రస్తుతం 40 మంది పనిచేయుచున్నారు. ప్రభుత్వ అనుమతితో మిగిలిన ఏడుగురుని నియామకాలు చేయగలమని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం ఇద్దరు డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని ఒక వైద్యునికి యాక్సిడెంట్ కావడంతో ఆయన సెలవులో ఉన్నారని తెలిపారు.
కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి కుటుంబ నియంత్రణ పద్ధతి కోవిడ్ 19 తర్వాత ఆపివేశారు. దానిని మరలా పునరుద్ధరణ చేయవలసిందిగా కోరి ఉన్నారని అలాగే ఏఎన్ఎంల కొరతపై వివరణ అడిగారని అలాగే, ఆసుపత్రి పాడైపోయినది అభివృద్ధి చేయవలసినదిగాను పి.హెచ్.సి ల సంఖ్య పెంచవలసినదిగా ఆమె కోరి ఉన్నారు. ప్రతి సచివాలయానికి మ్యాపు చేసినట్లుగా ప్రతి స్కూలుకి ఏఎన్ఎంని మ్యాప్ చేయాలని కృత్తివెన్ను జడ్పిటిసి అడిగారు.
ఈ విషయమై డి.ఎమ్.హెచ్.ఒ డాక్టర్ గీతాబాయి సమాధానమిస్తూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరిచి మెరుగైన సేవలు అందించుటకు తగిన ఏర్పాట్లు చేయుట జరుగుచున్నది కుటుంబ నియంత్రణ సేవలను పునరుద్ధరించుట జరుగును. పి.హెచ్.సి ల సంఖ్య పెంపుదల అంశము ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ప్రతి గ్రామ ,వార్డు సచివాలయాలకు ఆరోగ్య కార్యకర్తలను మ్యాపింగ్ చేసి ఆయా ప్రాంత పరిధిలో ఉన్న పాఠశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి.. అవసరమైన వారికి తగిన సేవలు, సలహాలు ఇవ్వవలసినదిగా ఆదేశాలు జారీచేసియున్నామని తెలిపారు.
గత సమావేశంలో పెనుగంచిప్రోలు జడ్పిటిసి సభలో మాట్లాడుతూ నైట్ వాచ్మెన్ పోస్ట్ మంజూరు లేదని ఆరోపించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు డి ఎం హెచ్ ఓ తెలిపారు
వైస్ చైర్పర్సన్, జడ్పిటిసి ఇబ్రహీంపట్నం పి.హెచ్.సి.లో మందులు లేవని తెలిపారు. డి.ఎమ్.హెచ్.ఒ. ఆ విషయమై జవాబు చెబుతూ: పి.హెచ్.సి లో మందులు అన్నీ అందుబాటులో ఉన్నవని అంతేకాకుండా 104 వాహన సేవల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు 67 రకాల మందులు 14 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించుట జరుగుతుందని తెలియజేశారు
నాగాయలంక జడ్పిటిసి గత సమావేశంలో తమ ప్రాంతంలోని ఆసుపత్రి పూర్తిగా పాడైపోయినదని ఆసుపత్రికి స్థలము ఉన్నందున అందులో ఆసుపత్రిలో అదనపు గదులు నిర్మించాలని, 108 వాహనమును కూడా అందుబాటులో ఉంచవలసినదిగాను కోరారు. 104, 108 వాహనాల నిలుపుదలకు షె డ్డు ఏర్పాటు చేయవలసినదిగా కోరి ఉన్నారు. ఈ అంశంపై డి.ఎమ్.హెచ్.ఒ. సమాధానం ఇస్తూ నాగాయలంక జడ్పిటిసి ప్రస్తావించిన అంశము నకు సంబందించి ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల సంస్థకు తెలియజేయగలమని తెలిపారు.
తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారని, లేడీ డాక్టర్నను నియమించవలసినదిగా కోరారు. ఆ సమస్యపై డి.ఎమ్.హెచ్.ఒ స్పందిస్తూ మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో లేడీ డాక్టర్ ను నియమించడం జరిగిందన్నారు.
అలాగే, రెడ్డిగూడెం జడ్పిటిసి తమ మండలంలో నాలుగు సచివాలయాలకు ఒక ఏఎన్ఎం మాత్రమే ఉన్నారని వారిని సక్రమంగా జనాభా అవసరం మేరకు మ్యాపింగ్ చేయాలని కోరినారు. సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి రీ షెడ్యూలింగ్ చేస్తామని డి ఎం హెచ్ ఓ తెలియజేశారు. సచివాలయాల పరిధిలోని జనాభా ప్రాతిపదికన ఆరోగ్య కార్యకర్తలను పునః పరిశీలించి నియామకాలు చేయగలమని తెలియజేసినారు.
మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) గత సమావేశంలో 108 అంబులెన్స్ సకాలంలో రాకపోవడానికి కారణాలు తెలియజేయాలని కోరి ఉన్నారని 108 కోఆర్డినేటర్ డి ఎం హెచ్ ఓ కు ఎందుకు అందుబాటులో లేరని, వెంటనే విచారించాలని కోఆర్డినేటర్ తో అందుబాటులో లేకపోపులపై సంజాయిషి కోరవలసిందిగా కోరి ఉన్నారు. ఈ విషయమై డి హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి స్పందిస్తూ శాసనసభ్యుల గారి ఆదేశం మేరకు జిల్లా కోఆర్డినేటర్ 108 నుండి సంజాయిషి పత్రాన్ని పొందామన్నారు.
పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పి.హెచ్.సి డాక్టర్ల నియామక వివరాలు అడిగారని పి.హెచ్.సి స్థల వివరములు పి.హెచ్.సి అభివృద్ధి పై తీసుకున్న చర్యల వివరాలను కోరగా,పి.హెచ్.సి లో ప్రస్తుతం ఇద్దరు డాక్టర్స్ ఉన్నారని. ప్రస్తుతం 2.4ఎకరంలో పి.హె సి నిర్మితమై ఉందని. ప్రస్తుతం ఉన్న పి.హెచ్.సీ స్థానంలోనే 30 పడకల సామజిక ఆరోగ్య కేంద్రంకు 10.45 లక్షలకు ఏపీఎంఐడిసి ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయమునకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నుండి డైరెక్టర్ అఫ్ హెల్త్ వారికి పరిపాల సంబంధం అనుమతులకై పంపడం జరిగినదని జిల్లా వైద్యానికి శాఖ అధికారిణి జవాబు ఇచ్చారు.
అదేవిధంగా కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖకు సంబంధించి గూడూరు జెడ్.పి.టి.సి లేవనెత్తిన మరో ప్రశ్నకు వ్యవసాయ సాగు విధానం మెళకువలపై రైతులందరికి క్రింది స్థాయి వ్యవసాయ అధికారులతో అవగాహన కల్పించవలసినదిగా కోరారని వ్యవసాయ శాఖ జిల్లాలోని అన్నీ ఆర్.బి.కె లలో నెలలో స్థితి మొదటి శుక్రవారం ఆర్.బి.కె స్థాయిలోను, రెండవ శుక్రవారం మండల స్థాయిలోను వ్యవసాయ సలహా మండలి సమావేశములు నిర్వహించబడుచున్నవని వ్యవసాయ విరామ సమయంలో రైతులు ఆర్.బి.కే లలో ఉన్న టి.వి ల ద్వారా వ్యవసాయ కార్యక్రమాలు వీక్షించే అవకాశము కలదని, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల వ్యవసాయ అధికారులతో ఆర్.బి.కే లలో వివిధ పంటలలో పాటించవలసిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
తోట్లవల్లూరు జెడ్.పి.టి.సి గత సమావేశంలో అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ప్రభుత్వం దాన్యం ఎకరానికి 30 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని కొనుగోలు పెంచడానికి వెసులుబాటు కల్పించవలసినదిగా కోరిన విషయమై వ్యవసాయ శాఖ స్పందిస్తూ ఈ సంవత్సరం నిబంధనల ప్రకారం ఖరీఫ్ ధాన్యం ఎకరానికి 35 బస్తాలు (26 క్వింటాళ్లు) కొనుగోలు చేయుటకు వీలు కలదని సమాధానం ఇచ్చారు.
నూజివీడు శాసన సభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు గత సమావేశంలో లేవనెత్తిన అంశము పై జవాబు ఇస్తూ నూజివీడు డివిజనులో ఖాళీగా వున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గృహ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (గృహ) పోస్టులను భర్తీ చేయవలసినదిగా కోరారు తుక్కులూరు నందు 70 గృహములు పూర్తి అయినవి కాని కరెంట్ లేదు. కావున దానిపై చర్య తీసుకుని కరెంట్ ఏర్పాటుకు వీధి దీపాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరారు
గృహనిర్మాణ శాఖ అధికారి జవాబు ఇస్తూ, తుక్కులూరు నందు ఇప్పటికి 60 గృహములకు విద్యుత్ కనక్షన్లు ఇవ్వడం జరిగినదని వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయబడినవని విద్యుత్ శాఖ వారు తెలియచేసినారు మరియు విద్యుత్ తీగల మార్పుచేయుట కొరకు రూ:1.30 లక్షలు జిల్లా కలెక్టర్ వారి ప్రొసీడింగ్స్ సంఖ్య 846/ 2022/లేవ్లింగ్/E, ది.20.06.2022 ద్వారా మంజూరు చేయడమైనదని వివరించారు.
అవనిగడ్డ, శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజి, హై స్కూల్స్ మద్య నుండి గాంధీ క్షేత్రం మెయిన్ రోడ్డు నుండి రోడ్డు నిర్మించాలని కోరారు ఈ విషయమై రోడ్లు భవనాల శాఖ అధికారి స్పందిస్తూ ఈ రహదారి రోడ్లు భవనాల శాఖ పరిధి లో లేనిది కాబట్టి తమ శాఖ ద్వారా ప్రస్తుతము రోడ్డు నిర్మించడం వీలుపడదని తెలిపారు.
గత సమావేశంలో ముసునూరు, జడ్.పి.టి.సి మాట్లాడుతూ, చెక్కపల్లి గ్రామములో డ్రైనేజీలు ఆక్రమించి కొంతమంది వ్యాపారం చేయుట జరుగుతుంది. దీనిపై స్పందన కార్యక్రమములో పలుమార్లు ఫిర్యాదు చేయడమైనదని అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, తగు చర్యను తీసుకోలేదు. కావున వెంటనే తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరారు ఈ విషయమై రోడ్లు భవనాల శాఖ అధికారి స్పందిస్తూ, ముసునూరు, జడ్.పి.టి.సి ఫిర్యాదు నిమిత్తము ది 23.11.2022 న మండల అభివృద్ధి అధికారి జడ్.పి.టి.సి, ముసునూరు వారితో సంప్రదించి పంచాయితీ కార్యదర్శి గ్రామసర్వేయరు రెవిన్యూ మరియు పోలీసు డిపార్టుమెంటు వారి సహకారముతో అక్కడ కచ్చా డ్రెయిస్ ఏర్పాటుచేయడమైనని తెలిపారు.
ఈ సర్వ సభ్య సమావేశంలో కృష్ణాజిల్లా ,ఏలూరు ,ఎన్టీఆర్ జిల్లాల ఉమ్మడి సర్వ సభ్య సమావేశం హాజరైన కలెక్టర్ రంజిత్ బాషా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, నూజివీడు మేకా ప్రతాప్ అప్పారావు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, కే డి సి సి చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.