విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోనగర్ రొండవ రోడ్డు లో వైద్యశిభిరాన్ని శనివారం ప్రముఖ వైద్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ డాక్టర్ జి.సమరం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న సెంటర్ అభినందనీయమని అన్నారు. ఆటోనగర్ లోని కార్మికులకు కేవలం ఇరవై రూపాయలతో చికిత్స మందులను ఉచితంగా ఇవ్వడం సంతోషానిచ్చిందని కార్మికులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన అన్నారు. క్షయ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని, వ్యాధి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని ఆయన అన్నారు. ఈ నెంటరుకు సహకారాలను అందిస్తున్న పీర్ ఎడ్యుకేటర్లను ఈ సందర్భంగా అభినందించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యసిబ్బందితో పని చేయడం అభినందించదగ్గ విషయం అని ఆయన అన్నారు. అనంతరం ఐలా చైర్మెన్ సుంకరి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం కొరకు సిబ్బంది అహన్రిశలు పాటుపడుతున్నారని, క్రమం తప్పకుండా వివిధ కార్యక్రమాల ద్వారా వైద్యశిభిరాలను నిర్వహిస్తున్నారని వాసవ్య మహిళా మండలికి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.
అనంతరం వాసవ్య మహిళా మండలి కార్యదర్శి శ్రీమతి జి. రశ్మి మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 15 నుండి మార్చి 15 వరకు నెలరోజుల పాటు వైద్యశిభిరాలను, అవగాహనా శిభిరాలను ఆటోనగర్ లోని వివిధ కూడలిలలో సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు. క్షయ వ్యాధి సోకే విధానాలను
తెలిపి ఆ లక్షణాలను ఉన్న కార్మికులకులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అందులో నిర్ధారణ అయిన వారికి గవర్నమెంట్ వారిచే ఉచితంగా మందులను అందజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు.
కార్యక్రమంలో అన్నే శివనాగేశ్వరరావు, అపోలో టైర్స్ హెల్త్ కేర్ సిబ్బంది డాక్టర్ ఆర్.స్వర్ణలత, కె.శ్రీనివాసరావు, సి.హెచ్ నాగరాజు, జె.మణికంటేశ్వరరావు, టి. మహాలక్ష్మి, ఎ.సత్యప్రసాద్, డి.వీరాంజనేయులు, పీర్ ఎడ్యుకేటర్లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …