Breaking News

దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కి కృతజ్ఞతలు…. : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటన లో జనసేన పార్టీ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఆమోదించిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కి కృతజ్ఞతలు . మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో 100% అమలు చేస్తారని ఆశిస్తున్నాం. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ పచారీ సరుకుల కాంట్రాక్ట ను ఒక కాంట్రాక్టర్ కే ఇవ్వరాదని,10 కోట్ల టర్నోవర్ నిబంధనను మార్చాలని, విజిలెన్స్ శాఖ పనితీరు సరిగా లేదని , పచారీ సరుకుల కాంట్రాక్టును ఐదు నుంచి పదిమంది కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆ విధంగా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేసి ఉన్నారు. అందుకు అనుగుణంగానే నిన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు అధికారులతో సమీక్ష నిర్వహించిన పచారి సరుకుల టెండర్లను నిలిపివేస్తామని, 10 కోట్ల రూపాయల టర్నోవర్ నిబంధన తీసివేశామని, ఇకనుండి పచారీ సర్కుల కాంట్రాక్టు ఒక్కరికే ఇయ్యమని ఈ కాంట్రాక్ట్ ను 3 విభాగాలుగా మారుస్తున్నామని పడితరం సామాగ్రికి 1 కోటి,అన్నప్రసాదం 2 కోట్లు మరియు ప్రసాదాల పోటు సరుకులకు 5 కోట్లు టర్నోవర్ నిబంధనలో కలిగి ఉండాలని ప్రకటించినారు, అదేవిధంగా పచారీ సరుకుల నాణ్యతను పరిశీలించేందుకు విజిలెన్స్ విభాగాన్ని రాష్ట్ర డిజిపి స్థాయి అధికారులు నియమిస్తామని తెలియజేసినారు. ఈ నిబంధనలో మార్పులు అన్నీ కూడా కేవలం జనసేన పార్టీ తరఫున మేం డిమాండ్ చేయబట్టే మార్పు చేశారని , పచారి సరుకుల కాంట్రాక్టు లో నిబంధనలు మరింత సరళీకృతం చేయాలని కోరుతూ మహేష్ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసినారు. మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఎందుకంటే దుర్గగుడి పాలకమండలి చైర్మన్ చాంబర్ ప్రారంభోత్సవానికి పిలవలేదని మేము మాట్లాడిన తర్వాత మాత్రమే చైర్మన్ మరియు పాలకమండలి సభ్యులు వెళ్లి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ని శాలువా కప్పి సన్మానించినందుకు సత్యనారాయణ మాకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *