తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, ప్రభుత్వరంగ సంస్థల, ప్రైవేటు పెద్ద పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ద్వారా వ్యాపార సంబంధాలు ఏర్పడి కొనుగోలుదారులను, అమ్మకపుదారులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నేడు వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మరియు బయ్యర్ – సెల్లర్ ఇంటర్యాక్షన్ మీట్ ఇండస్ట్రయల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్.వి.యునివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రో.రాజా రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక గెస్ట్ లైన్ డేస్ హోటల్ నందు భారత ప్రభుత్వ ఎం.ఎస్.ఎం.ఈ. డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ కార్యాలయం విశాఖపట్టణం వారి ఆద్వర్యంలో 27, 28 తేదీలలో నిర్వహించనున్న వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మరియు బయ్యర్ – సెల్లర్ ఇంటర్యాక్షన్ మీట్ ఇండస్ట్రయల్ ఎగ్జిబిషన్ కు ఎస్.వి. యూనివర్సిటీ వి.సి. ముఖ్య అతిధిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
వి.సి. ప్రొఫెసర్ రాజా రెడ్డి మాట్లాడుతూ ఎస్.వి. యూనివర్సిటీ ఎం.ఎస్.ఎం.ఈ నోడల్ ఏజెన్సీగా సహకారం అందిస్తున్నదని యువత ఎం.ఎస్.ఎం.ఈ. ల వైపు మొగ్గు చూపి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. ఎం.ఎస్.ఎం.ఈ ఎగుమతులలో దేశం అగ్రస్థానంలో ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎం.ఎస్.ఎం.ఈ. ల ఉత్పత్తుల ఎగుమతులకు మంచి సహకారం అందుతున్నదని యువత గ్రహించాలని అన్నారు. నేడు ఈ కార్యక్రమం ఏర్పాటులో బాగస్వాములు కావడం సంతోషమని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎస్.వి. యూనివర్సిటీ సహకారం ఎల్లప్పుడూ అందిస్తుందని అన్నారు. దేశంలో ఎం.ఎస్.ఎం.ఈ. ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ఈ రంగంలో ప్రధానంగా ఉందని అన్నారు.
ఎం.ఎస్.ఎం.ఈ డెవలప్మెంట్ ఫెసిలిటేషన్ కార్యాలయ ఎ.డి. జి.వి.ఆర్. నాయుడు వివరిస్తూ ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకర్లు, ఎస్.ఎం.ఈ. లతో బాగస్వామ్యం కోసం దాదాపు 20 మంది స్టాల్స్ ఏర్పాటు విధంగా తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం అందించడం ద్వారా 25 శాతం ఎం.ఎస్.ఎం.ఈ ఉత్పత్తులను ప్రభుత్వరంగ, ప్రైవేటు పరిశ్రమలు కొనుగోలు లక్ష్యంగా ఎం.ఎస్.ఎం.ఈ.ల ప్రోత్సాహం కల్పించడం జరుగుతుందని వివరించారు. తేదీ 28 న ఉదయం 10.30 నుండి బ్యాంకర్స్ తమ రుణ మంజూరు పథకాలను వివరించనున్నారని అన్నారు.
ఈ సమావేశంలో బ్యాంకర్లు, ఎగ్జిబిటర్స్ తమ రుణ సౌకర్యాలను, ఉత్పత్తులను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. ఇందులో ప్రధానంగా దక్షణ మధ్య రైల్వే అవసరాలకు కావలసిన పరికరాలను ఎం.ఎస్.ఎం.ఈ లు అందించడానికి ప్రదర్శనలో ఉంచారు. వీటితో పాటు వైజాజ్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిబిషన్, నయారా ఎనర్జీ తమ ప్రాజెక్టులను వివరించి బాగస్వాములు కావాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వేస్ మార్కెటింగ్ రామాంజనేయ, జి.ఎం. డి.ఐ.సి ప్రతాప్ రెడ్డి, ఎస్.బి.ఐ. (ఎస్.ఎం.ఈ) ఎ.జి.ఎం మురళీ, ఆర్.ఐ.ఎన్.ఎల్. ఎ.జి.ఎం. ప్రసాద్, నయారా ఎనర్జీ, జడ్.ఎం. రవి శంకర్, పారిశ్రామిక ఔత్సాహికులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.