Breaking News

రూ.5 లక్షల ఆర్థిక సహాయం…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు రూ.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మంత్రి క్యాం పు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య సేవలు అందిస్తున్న ఘనత మన జగనన్న కే చెల్లిందని పేర్క న్నారు. అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు చేసిన ఆయా పేద కుటుంబాలకు చేదోడుగా నిలిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కొవ్వూరు పట్టణానికి చెందిన మట్టే సీతారామాంజనేయులకు సర్జరీ నిమిత్తం మూడు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు . అదేవిధంగా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి గ్రామానికి చెందిన నామన శివసాయి వైద్య ఖర్చులు నిమిత్తం శివసాయి తల్లి సీతారత్నం రెండు లక్షలు చెక్కును అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *