-ఈరోజు స్పందనలో వచ్చిన అర్జీలు.. 157
-నిర్ణీత కాలవ్యవధిలో వాటిని పరిష్కరించాలి.
-ఏ ఒక్క అర్జీ పునర్ ప్రారంభం కాకుండా పరిష్కారం చెయ్యాలి
-“1902” జె కె సి అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలి
-జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో, 1902 కాల్ సెంటర్ జేకేసి కి వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడీన విధంగా క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అధికారులు ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత, డి ఆర్ వో, ఇతర జిల్లా అధికారులుతో కలసి వివిధ సమస్యలు పరిష్కారం కై ప్రజల నుంచి 157 అర్జీలు స్వీకరించామన్నారు. వాటిలో ఆన్లైన్ లో 112, ఆఫ్ లైన్ లో 45 వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ స్పందన లో వచ్చిన అర్జీలలో ఆర్థిక, ఆర్ధికేతర అంశాల వారీగా విశ్లేషణ చేసుకుని, ఆమేరకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం నిమిత్తం ఉన్న వాటిని సంబందిత ఉన్నత స్థాయి అధికారులు ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. 1902 జేకేసి కి వొచ్చిన ప్రతి అర్జీని సిఎం కార్యాలయం ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని అందించాలన్నారు. జిల్లా, డివిజన్, మండల పరిధిలోని అధికారులు వ్యక్తిగత భాద్యతతో అర్జీలను పరిష్కరించాలన్నారు. జేకేసి ద్వారా ప్రజలు అర్జీలు నమోదు, పరిష్కారం అనంతరం ఆన్లైన్ అప్డేషన్ పై సంబంధిత వీడియో పోస్ట్ చేసినట్లు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, పభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షలు నిర్వహిస్తున్నందున జిల్లా అధికారులు శాఖలు వారి అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు పై ప్రగతి నివేదికలు సమీక్షలకు ముందు గానే అందించే విధంగా సమాయత్తం కావాలన్నారు. జిల్లాలోని ప్రతి కార్యాలయం లో పనిచేస్తున్న అధికారులు సిబ్బందికి సంబంధించి ముఖ చిత్ర హాజరు (FRS) రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయి స్పందనలో ఇప్పటి వరకు 429 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 22 ఫిర్యాదులు తిరిగి రావడం జరిందన్నారు. పెండింగ్ అర్జిలో 48 గంటల్లోగా పరిష్కారం చేయాల్సినవి 9 అర్జీలు, 24 గంటల్లో పరిష్కరించాల్సినవి రెండు , మూడు రోజుల్లోగా పరిష్కారం చేయాల్సినవి అర్జీలు తొమ్మిది, 72 గంటలు వ్యవధి దాటినవి 387 ఉన్నాయని కలెక్టరు తెలిపారు.
స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు :-
రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లెప్పర్సీ కాలనీలో నివశిస్తున్న ఆరే స్యామ్సన్, వీరన వీర్రాజమ్మ, జి. వెంకాయమ్మ, వి. సువార్తమ్మ మట్టా మేరీ కుమారి, కె. వెంకట్రావులు తమ అర్జీలో కుష్ఠు వ్యాధి గ్రస్తులమయిన మేము గత 40 ఏళ్ళుగా స్థానికంగా నివాస ముంటున్నారు. వేలి ముద్రలు పడక అంత్యోదయ పథకం ద్వారా ఉచితంగా అందచేస్తున్న బియ్యం అందడం లేదన్నారు. కావున మా దరఖాస్తును పరిశీలించి “ఏ ఏ వై” పథకం ద్వారా అంగవైకల్యంతో బాధపడుతున్న మాకు బియ్యం అందించాలని కోరారు. దీనిపై కలెక్టరు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా డిఎస్ఓ ను ఆదేశించారు.
ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామ నివాసి సిహెచ్ శ్రీనివాస్ తమ అర్జీలో 2019 సం.లో వైఎస్ఆర్ హైసింగ్ పథకం ద్వారా ఇల్లు కట్టుకొనుటకు రుణం మంజూరు అయ్యిందని, ఇప్పటి వరకు రుణం ఏకౌంట్ నందు జమ కాలేదు. నాకు ఆర్థిక స్థోమత లేనప్పటికీ అప్పులు చేసి ఇంటినిర్మాణం పూర్తి చేసాను. కావున మంజూరు అయిన రుణం అందించాలని కోరారు. కలెక్టరు స్పందింస్తూ జిల్లా హౌసింగ్ అధికారి పర్యవేక్షణ చేసి అర్జీదారుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
రాజమండ్రి అర్బన్ దానవాయిపేట నివాసి సయ్యద్ అబీబుల్లా తమ అర్జీలో షా కన్షస్ట్రక్షన్ కంపెనీ ద్వారా హౌసైట్స్ లెవిలింగ్ నిమిత్తం ఎర్త లెవిలింగ్ పరికరాలు సరఫరా చేయడం జరిగింది. పేమెంట్ నిమిత్తం వాటికి సంబందించి బిల్లులు కూడా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో సమర్పించినా ఇంతవరకు నగదు జమ కాలేదు. కావున పేమెంట్ మంజూరు చేయాలని వారు అర్జీలో కోరారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం నివాసి డి.సరోజిని తమ అర్జీలో తన భర్త గోపి మోసం చేసి కాకినాడ డిఎమ్ హెచ్ ఓ కార్యాలయం నుంచి నేను మానసిక రుగ్మత కల్గివున్నానని సర్టిఫికేట్ తేవడం జరిగింది. అయితే వాస్తవంగా నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఈ అంశంపై తగు చర్యలు చేపట్టి నా సర్టిఫికేట్ ను రద్దు చేయాల్సిందిగా వారు అర్జీలో కోరారు.
రాజమండ్రి రూరల్ మండలం హుక్కుంపేట గ్రామానికి చెందిన సిహెచ్ శెన్నకేశవ గత మూడేళ్ళవరకు పెయింటింగ్ పనులు చేసి బాగానే జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నానని, అయితే అనుకోని విధంగా నాకు పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, నా పనులు నేను చేసుకునే విధంగా ఎలక్ట్రిక్ వీల్ చైర్ మంజూరు చేసి అందించాలని వారు అర్జీలో కోరారు. దరఖాస్తును పరిశీలించి అర్జీదారునికి వీల్ చైర్ మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీని ఆదేశించారు.
ఈ స్పందన కార్యక్రమం డీఆర్వో జి. నరశింహులు, టూరిజం అధికారి స్వామినాయుడు, డి ఎం హెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు, టీబి, డిసిహెచ్ఒ డా.సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ డి.బాలశంకర్ రావు , డీ పి వో పి. జగదాంబ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవ రావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డిఆర్డిఏ పీడి ఎస్. సుమలత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి, డి ఎల్ డిఓ వీణాదేవి, జిల్లా ట్రెజరీ అధికారి సత్యనారాయణ, పలువురు జిల్లా శాఖా అధికారులు , సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.