Breaking News

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏ ఆర్ టి  సరోగసి తొలి జిల్లాస్థాయి సమావేశం.

-రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రముల్లో మాత్రమే వైద్య సేవలు వినియోగించుకోవాలి.
– కలెక్టర్ డా. మాధవీలత
రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రము లో  మాత్రమే సేవలు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అన్నారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి తొలి ఏ ఆర్ టి  సరోగసి కమిటీ సమావేశం కలెక్టర్ మాధవీలత  అధ్యక్షతన జరిగింది. సమావేశం లో సభ్యులు ఏ ఆర్ టి యాక్ట్ నిబంధనలు గురించి చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా సంతాన సాఫల్యత కేంద్రం నెలకొల్పుటకు నేషనల్ పోర్టల్ నందు నమోదు అయ్యి పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేసి జిల్లా కమిటీ తీర్మానించిన కేంద్రాలలో మాత్రమే సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. అనుమతి లేని ఆసుపత్రుల యందు సంతాన సాఫల్యం కొరకు ఎవరు వెళ్లి వైద్యము తీసుకొనవద్దని తెలియజేశారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాలు నాలుగు రకాలుగా ఉంటాయని అసిస్టెడ్  రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్ లెవెల్- 1, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్లినిక్ లెవెల్ -2, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బ్యాంక్ మరియు సరోగసి క్లినిక్ లు  అనే నాలుగు రకాలుగా ఉంటాయన్నారు. ఏ ఆర్ టి క్లినిక్ లెవెల్ -1  నందు ఐవిఎఫ్   సేవలు మాత్రమే జరుగుతాయని, ఏ ఆర్ టి  క్లినిక్ లెవెల్ 2 నందు ఐవిఎఫ్ మరియు సంతాన సాఫల్యత కొరకు పూర్తి పరీక్షలు జరిపి వాటిలో తగిన సేవలు అందిస్తారన్నారు. అదేవిధంగా బ్యాంక్ నందు కేవలము సెమెన్ ను మరియు అండమును మాత్రమే  భద్రపరచు నిమిత్తం ఏర్పాటు చేయబడినదని, సరోగసి క్లినిక్ నందు వ్యక్తుల అద్దెగర్భము ద్వారా వ్యక్తులను ఉపయోగించి తగిన సంతాన సాఫల్యత  సాధించే రీతిగా సేవలు  అందిస్తారని తెలియజేశారు .కమిటీ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వైస్ చైర్మన్, ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మెంబర్, ఎన్జీవో మరియు మెడికల్ ప్రాక్టీషనర్ మెంబర్ సభ్యులుగా ఉంటారని తెలియజేశారు. ఏఆర్టి సరోగసి క్లినిక్స్  తనిఖీ నిమిత్తం డి ఎం హెచ్ ఒ ,గైనకాలజిస్ట్ , పాథాలజిస్ట్, రేడియాలజిస్ట్, సోషియాలజిస్ట్, ఎన్జీవో మరియు మోనిటరింగ్ కన్సల్టెంట్ తో కూడిన సభ్యులు ఉంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డి ఎం మ్ హెచ్ ఒ డా. కె. వెంకటేశ్వర రావు   మాట్లాడుతూ జిల్లాలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ నందు, ప్రగతి ఐవిఎఫ్ లేప్రోస్కోపిక్ సెంటర్ నందు , హర్ష ఐవిఎఫ్ ల్యాబ్ నందు  ఏ  ఆర్  టి  క్లినిక్  లెవెల్ 2 సేవలు అంధిస్తారని తెలియచేసారు. ప్రగతి ఐవిఎఫ్ లాప్రోస్కోపిక్ సెంటర్, హర్ష ఐవిఎఫ్ ల్యాబ్ నందు ఏ ఆర్ టి బ్యాంక్ సేవలను అంధిస్తారని తెలియచేసారు. లండన్ ఐవిఎఫ్ సెంటర్ నందు ఏ  ఆర్  టి  క్లినిక్  లెవెల్ 1  సేవలు మరియు ప్రగతి ఐ వి ఎఫ్ లాప్రోస్కోపిక్ సెంటర్ నందు సరోగసి సేవలు అంధించబడతాయని పై క్లినిక్స్ నందు మాత్రమే సంతాన సాఫల్య సేవలు వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డా. జి వరలక్ష్మి,  డి ఎన్ ఎం ఒ డా. పి లక్ష్మీదేవి ,  గైనకాలజిస్ట్ డా. సిహెచ్ శైలజ,  పీడియాట్రీషియన్ డా. ఎం మాణిక్య నాయకర్, పేతాలజిస్ట్ డా. నజీర్, ఉమెన్ ఎన్జీవో తరఫున భూమిక, ఉమెన్స్ కలెక్టివ్ సభ్యులు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *