-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2023 -ఆంధ్ర యూనివర్సిటీ అనుసంధానమైన ” గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కు చెందిన లక్ష్మి లాలిత్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరు ఛాంబరులో ఢిల్లీ లో సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసా పతాన్ని అందుకున్న లక్ష్మి లాలిత్య జిల్లా క లెక్టరు మాధవీలత అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలో ఆరోగ్యం, యువత కోసం మంచి క్రీడలు (Health, Well being sports – Agenda for Youth) అనే అంశం మీద నాలుగు నిమిషాలు మాట్లాడి, రాష్ట్ర స్థాయి పోటికి ఎంపికై రాష్ట్ర స్థాయిలో పరిశ్రమలు, ఆవిష్కరణ, 21 శతాబ్దపు నైపుణ్యాలు వంటి అంశాల ఆంధ్రప్రదేశ్ తరువున ఎంపికై మార్చి 1,2 తేదీలో జరిగిన ఆ కార్యక్రమంలో లోక్ సభా స్పీకర్ ఓం బిర్లా, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ – కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిని,శ్రీ నిషిత్ ప్రమాణిక కేంద్ర హోం వ్యవహారాల మంత్రులను కలిసి వారి నుంచి ప్రశంస పత్రాన్ని అందుకున్న లాలిత్య ప్రతిభను కలెక్టరు అభినందించారు.
కార్యక్రమంలో డైట్ స్కూల్ ఆఫ్ ఫార్మని ప్రిన్సిపాల్ డా. యండి. ధవరాజు, ఎన్.ఎస్.ఎస్. పీఓ షేక్ మీరా లక్ష్మి ఉన్నారు.