తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 16 న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ – I, నేషనల్ డిఫెన్స్ అకాడమి –I, నావల్ అకాడమి – I పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తిరుపతి ఆర్.డి.ఓ. మరియు పరీక్షల కస్టోడియన్ వి.కనకనరసా రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ఆర్.డి.ఓ. కార్యాలయంలో యు.పి.ఎస్.సి. పరీక్షల నిర్వహణపై ఆర్.డి.ఓ. మరియు యు.పి.ఎస్.సి.న్యూ డిల్లీ సూపరింటెండెంట్ శ్రీరామ్ సమీక్ష నిర్వహించారు. ఆర్.డి.ఓ. మాట్లాడుతూ ఈ నెల 16 న సి.డి.ఎస్- I పరీక్ష మూడు సెషన్లలో ఉదయం 9 నుండి 11 గంటల , మ.12 నుండి 2, 3 నుండి 5 గంటల వరకు శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ మరియు పి.జి.కాళాశాల వింగ్ –ఎ లో, ఎన్.డి.ఎ మరియు ఎన్.ఎ – I పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 10 నుండి 12.30 వరకు, మద్యాహ్నం 2 నుండి 4.30 వరకు శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ మరియు పి.జి.కాళాశాల వింగ్ –బి మరియు శ్రీ పద్మావతీ జూనియర్ కాళాశాల వింగ్ – ఎ లో నిర్వహణకు ఏర్పాట్లు చేసామని అన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఐ.డి. ప్రూఫ్ తీసుకుని రావాలని, ఎలక్ట్రానిక్ వస్తువులు, క్యాలికులేటర్ వంటివి పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఉండదని అన్నారు. పరీక్షా సమయానికి 10 నిమిషాల ముందుగానే ప్రధాన ద్వారాలు మూసివేస్తారని అన్నారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఎస్.పి.డి.సి.ఎల్. వారికి సూచించారు. ఈ సమీక్షలో తహశీల్దార్లు సుబ్రహ్మణ్యం, రోశయ్య, ద్వారకానాథ రెడ్డి, ప్రమీల, పరీక్షా కేంద్రాల సుపెర్వైజర్లు, ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. శ్రీనివాసుల నాయుడు, పోస్టల్ శాఖ రెడ్డెప్ప, స్పెషల్ బ్రాంచ్ శ్రీనివాసులు, మెడికల్ డా.ఊర్మిళ, డి.టి. లు లక్ష్మీనారాయణ, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …