తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 17న సోమవారం జగనన్న వసతి దీవెన 2022 -23 విద్యా సంవత్సరానికి తొలివిడత అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు రాష్ట్రవ్యాప్తంగా జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా శింగనమల నుండి ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ కే. వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం వీక్షించే విధంగా జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి కార్యక్రమం అనంతరం జిల్లాలో అర్హత కలిగిన 39,960 మంది విద్యార్థులకు రూ. 38.29 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందించనున్నామని, ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు హాజరుకానున్నారని తెలిపారు .
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …