Breaking News

శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెంబర్ 9 తేదీ 13 ఏప్రిల్ మేరకు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా రానున్న మే నెల లో వైభవంగా గంగమ్మ జాతరను నిర్వహించే దిశలో అన్ని శాఖల విభాగాలు సమన్వయంతో పని చేయాలని, అందుకు ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేలా సన్నద్ధం అవ్వాలని ముందస్తు ఏర్పాట్ల సమావేశంలో అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.

సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వారి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా రద్దీ దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. క్యూ నియంత్రణ, కంట్రోల్ రూం ఏర్పాటుతో పర్యవేక్షణ, పార్కింగ్, శానిటేషన్ నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ బందోబస్తు, మెడికల్ క్యాంపు లు ఏర్పాటు, అంబులెన్స్ లు, 108 వాహనాల ఏర్పాటు అందుబాటులో ఉంచడం హాస్పిటల్ లకు మ్యాపింగ్ చేయడం, త్రాగు నీరు ఏర్పాటు, విద్యుత్తు సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని, ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్, జాతర ప్రాశస్త్యం ప్రాపగండ తదితర అంశాలపై ప్రణాళికలు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పబ్లిక్ టాయ్లెట్లు ఏర్పాటుకు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సి సి కెమెరాల ఏర్పాటుతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించేలా ఏర్పాటు ఉండాలని తెలిపారు.

మే 1 నుండి 5 వరకు కుంభాభిషేఖం నిర్వహణ ఉంటుందని 5 వ తేదీన ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని గంగమ్మ గుడి కార్య నిర్వహణ అధికారి మునికృష్ణ తెలుపుతూ 7న సహస్ర కలశాభిషేఖం ఉంటుందని అన్నారు. మే 9 నుండి 17 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని, అందులో 13 న సారె సమర్పణ, 14న మాతంగి వేషం, 16 న గంగ జాతర ఉంటుందని వివరించగా గంగ జాతర నాడు సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగినట్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ముందుగా ప్రజలకు గంగమ్మ జాతర ప్రాశస్త్యం గురించి తెలిసేలా పెద్ద ఎత్తున పాల్గొనేలా గతంలో చేస్తున్న విధంగా వాలంటీర్ల ద్వారా పట్టణంలో ఇంటింటికీ పాంప్లెట్, కుంకుమ ప్రసాదాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

ప్రముఖుల పర్యటనల వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగు రీతిలో దర్శన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు అందేలా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్ ఉండాలని అన్నారు. అన్ని శాఖల వారి సమన్వయంతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ను విజవంతం చేద్దాం అని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జే సి డికే బాలాజీ, తిరుపతి నగరపాలక కమిషనర్ హరిత, డిఆర్ఓ శ్రీనివాసరావు, తిరుపతి ఆర్ డి ఓ కనక నరసారెడ్డి, ఎస్ డి సి భాస్కర్ నాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీ లేఖ, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, డి.ఎస్.పి మురళి కృష్ణ, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామ కృష్ణారెడ్డి, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ చంద్ర మౌలీశ్వర్ రెడ్డి, ఎస్ ఈ నగరపాలక సంస్థ ఎస్ ఈ మోహన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *