Breaking News

స్పందన వినతులకు అత్యంత ప్రాధాన్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలకు అర్థవంతo గా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె. బాలాజీ తో కలసి జిల్లా కలెక్టర్ స్పందన గ్రీవెన్స్ అర్జీలను స్వీకరించారు. వీరితో పాటు డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఎస్ డి సి లు కోదండ రామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలేఖ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. అర్జీదారులకు స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు.

శాఖల వారీగా మొత్తం 119 అర్జీల వివరాలు :
రెవెన్యూ శాఖకు- 94, ఎస్.పి.ఎం.వి.వి -1,పోలీస్ శాఖ 8, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ మరియు ట్రేడింగ్ 1, ఆర్.టి. ఓ 1, డి.ఈ. ఓ 3, జిల్లా నైపుణ్య అభివృద్ది శాఖ 1, అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి 1, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ 2, సి.డి.పి. ఓ 1, డి.సి.హెచ్.ఎస్ 1, డి.పి. ఓ 1, పి.డి. హౌసింగ్ 2, ఈ.డి ఎస్.సి కార్పొరేషన్ 1, పి.డి. డ్వామా 1 లు కలిపి మొత్తం 119 వినతులు రావడం జరిగిందని జిల్లా అధికారులు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాల్సిందిగా స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *