Breaking News

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

-ప్రభుత్వ ఆదేశాల అమలును ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు అమలు చేయాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ జిల్లా డిసిప్లినరీ కమిటీ మొట్ట మొదటి సమావేశం జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అధ్యక్షతన ఎక్స్ అఫిషియో అడిషనల్ సీఈఓ ఆరోగ్యశ్రీ హోదాలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ తో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లో గుర్తించబడిన వ్యాధులకు నగదు రహిత ఆరోగ్యశ్రీ సేవలు అర్హత గల పేదవారికి, ఉద్యోగస్తులకు అందించాలని, చికిత్స సమయంలో నాణ్యమైన ఆహారం మరియు చికిత్స అనంతరం ఫాలో అప్ సమయంలో మందులు సరిపడా తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరంగా ఉండి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ సేవలు ఉండాలని ఆ దిశలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల దృక్పథం సేవలు ఉండాలని, వైద్యో నారాయనో హరి అని నమ్మి వచ్చే పేదవారికి సకాలంలో మంచి వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నదని హితవు పలికారు. ఆరోగ్య మిత్రలు పేద రోగులకు సరైన రీతిలో మార్గదర్శనం చేసి సహకారం అందించాలని అన్నారు.

ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు ఉండరాదని, కానీ కొన్ని హాస్పిటల్స్ పై ఫిర్యాదులు నమోదు అవుతున్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఫిర్యాదులు నమోదు అయితే సంబంధిత ఆసుపత్రి పై చర్యలు ఉంటాయని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ బాధ్యత ఆసుపత్రి సూపరింటెండెంట్ వారిది అని, ఆసుపత్రి మెడికల్ కోఆర్డినేటర్ గా స్పెషలిస్ట్ డాక్టర్ ది బాధ్యతని సూచించారు. బర్డ్స్, పద్మావతి పిల్లల గుండె ఆసుపత్రి, స్విమ్స్ తదితర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నిబంధనల మేరకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఫిర్యాదులు లేకుండా పనితీరు ఉండాలని సూచించారు. రుయా హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ కింద పని చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ల ను సరిపడా నిబంధనల మేరకు నియామకానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆరోగ్య మిత్రలు రోగులకు అందుబాటులో లేని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని, చికిత్స పొందిన రోగుల నుండి డబ్బులు వసూలు చేయడం లాంటి పనులు చేయరాదని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఆరోగ్యశ్రీ పేషెంట్ కు సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీ, ఆసరా లెటర్, కన్ఫర్మేటివ్ లెటర్, కన్సెంట్ లెటర్ తదితర పత్రాలను సకాలంలో అందజేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి డిసిహెచ్ఎస్ ప్రభావతి, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శివ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి రుయా సూపర్డెంట్ నాగ మునీంద్రుడు, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్, బర్డ్స్ స్పెషల్ ఆఫీసర్ రెడ్డప్ప మరియు పద్మావతి హార్ట్ అండ్ చిల్డ్రన్ స్పెషాలిటీ డైరెక్టర్ శ్రీనాథ్ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *