Breaking News

రాజమండ్రి వాసులకు క్రీడలు, వినోదం, ఉల్లాసానికి వేదిక ‘హ్యాపీ స్ట్రీట్’.

-‘హ్యాపీ స్ట్రీట్’ వంటి కార్యక్రమాన్ని ప్రారభించుకోవడం సంతోషంగా ఉంది.
-హోం మంత్రి తానేటి వనిత
-శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు వత్తిడిని అధికమించేందుకు ‘హ్యాపీ స్ట్రీట్’. వేదిక ఎంతో దోహదపడుతుంది.
-కలెక్టరు మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నగరంలోని అన్ని వయసుల వారికీ ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించడం, క్రీడలు, శారీరక మానసిక ఉల్లాసం తో ఆదివారం ఆనందంగా గడిపేటందుకు ‘హ్యాపీ స్ట్రీట్’ వంటి కార్యక్రమాన్ని ప్రారభించుకోవడం సంతోషంగా ఉందని హోమ్ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక జేఎన్ రోడ్డు ఏకేసీ కళాశాల వద్ద హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమాన్ని హోమ్ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా కే. మాధవీ లత, ఎంపీ మార్గని భరత్ రామ్, రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, మున్సిపల్ కమీషనర్ కే. దినేష్ కుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. నేటి ఆధునిక వాతావరణం లో పనులతో అందరూ బిజీ బిజీగా ఉంటున్నామన్నారు. వత్తిడిని తగ్గించేందుకు మానసి ప్రశాంతత కొరకు హ్యాపీ స్ట్రీట్ వంటి కార్యక్రమాల ఎంతో ఉపయోగపడతాయన్నారు. పిల్లల తో పాటు పెద్దలు కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పాల్గొనడం వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక శరీరక ఉల్లాసం కలుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరం నగరంలో హ్యాపీ స్ట్రీట్ భావన రాష్ట్రంలో దిశా నిర్దేశనం చేసెలా రానున్న రోజుల్లో మరింతగా ఆకర్షణగా రూపుదిద్దడం జరుగుతుందని అన్నారు. దినేష్ కుమార్ ప్రత్యేకంగా వివిధ నగరాల్లో పర్యటించి కలకత్తా మోడల్ ప్రత్యేకత అత్యంత ఆకర్షణ కలిగి ఉండడంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సాంస్కృతిక నగరంగా ఇప్పటికే నగరం రాష్ట్రంలో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. గత ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా సుమారు రూ.190 లక్షలతో డ్రైన్స్ రహదారుల నిర్మాణం, సుందరీ కరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంతంలో ఈట్ స్ట్రీట్, కంబాల చెరువు ప్రాంతంలో దండి సత్యాగ్రహం విగ్రహాలు, నేడు ఏకేసి కళాశాల రోడ్డు లో హ్యాపీ స్ట్రీట్ వంటి కార్యక్రమాలు చేపట్టి నగరానికి మరింత ప్రాచుర్యం కోసం పనిచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆవ రహదారి ప్రాంతం లో రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతొందని అన్నారు. రాజమహేంద్రవరం అభివృద్దికి ప్రజలభాగస్వామ్యం ఎంతో అవసరమని అందరం కలసికట్టుగా పనిచేసి రాజమహేంద్రవరాన్ని మరింత అభివృద్ది చేద్దామన్నారు.

మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో పూణే, బొంబాయి నగరాలలో ఉండే ‘హ్యాపీ స్ట్రీట్’ కొత్తగా నగర వాసులకు పరిచయం చేస్తున్నామని చెప్పారు. కాలంతో పాటు పరిగెడుతున్న మనకు విశ్రాంతి ఉండటం లేదని, కనీసం ఆదివారం ఆ వత్తిడి ని అధిగామించేందుకు ఈ హ్యాపీ స్ట్రీట్ ఎంతో దోహద పడుతుందన్నారు. యువత కొరకు మంచి కార్యమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడే వున్నా పార్క్ ను కూడా ఒక ఐకానిక్ మాదిరిగా ఆహ్లాదకరంగా తీర్చి దిద్దుతామన్నారు. వారంలో ఒక రోజైనా హాయిగా, ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ హ్యాపీ స్ట్రీట్ కాన్సెప్ట్ రాజమండ్రి నగర వాసులకు పరిచయం చేస్తున్నామన్నారు. వినోద కార్యక్రమాలుగా జుంబా డాన్స్, యోగ, లైవ్ స్టేజ్, బెట్ డోర్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాలల కోసం అనేక క్రీడా, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కమీషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ముంబై, పూనే మహానగరాల తరహాలో రాజమహేంద్రవరం లో హ్యాపీ స్ట్రీట్ ప్రతీ ఆదివారం నుండి ఉదయం 6 గంటలు నుంచి 11 గంటల వరకు పిల్లలకు పెద్దలకు అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. వారిలో ఉన్న ప్రత్యేక టాలెంట్ని ప్రదర్శించేందుకు వేదికగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జుంబో డాన్స్, యోగ, లైవ్ స్టేజ్, ఔట్ డోర్ బాడ్మింటన్, ఔట్ డోర్ టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలు నిర్వహణ తో పాటు గా బాలల కోసం ప్రత్యేకంగా బోర్డ్, లైఫ్ సైజ్ క్రీడలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. “హ్యాపీ స్ట్రీట్” లో పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరు పాల్గొని సంతోషంగా గడపాలని కోరారు.

రూడా ఛైర్పర్సన్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ది కొరకు నగర పరిధిలో రు. 8 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసామన్నారు.

కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, మున్సిపల్ కమీషనర్ కే. దినేషనల్ కుమార్, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు అడపా శ్రీ హరి, అధికారులు, పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *