-ఈ విద్యా సంవత్సరంలోనే 150 ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్ ప్రారంభం.
-ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్న మంత్రి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో. 17 వైద్య విద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోగ్య విద్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని పేర్కొన్నారు. సోమవారం మంత్రి పర్యటనలో రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలను పరిశీలించి అనంతరం మీడియాతోమాట్లాడుతూ నూతనముగా రు. 475 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిర్మించునున్న 17 వైద్య విద్య కళాశాల ప్రాధాన్యత క్రమంలో మొదటి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల పట్టణాల్లో నిర్మించినట్లు పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఈ వైద్య విద్య కళాశాలను 150 ఎంబీబీఎస్ సీట్లతో ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని పర్మిషన్లు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే రాజమహేంద్రవరంలో బాయ్స్ బాలుర హాస్టల్స్, పరిపాలన విభాగానికి సంబంధించిన బ్లాక్స్, వైద్య కళాశాల గదుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని మంత్రి రజని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య రంగాన్ని స్వర్ణయంగా మారుస్తూ అర్హులైన అందరికీ ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 350 పడకలు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి రానున్న రోజుల్లో మరిన్ని బెడ్స్ ను పెంచుతూ మెరుగైన వైద్య సేవలను రోగులకు అందించడం జరుగుతుందన్నారు. వైద్య కళాశాల నిర్మాణం వలన ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈ ప్రాంతంలోనే వైద్య సేవలును ప్రజలకు అందిస్తారని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఎంత ఖర్చయినప్పటికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు. ఆసుపత్రిలోని వైద్య పరికరాలు మరమ్మత్తులకు గాను బయో మెడికల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నూతనంగా ఒక్క మెడికల్ కాలేజీ ని కూడా అందుబాటులోకి తేలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మీడియా ప్రతినిధులకు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కోవిడ్ వంటి ఎటువంటి ఏరియన్స్ వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య విభాగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రాంతంలో 700 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా ప్రజలకు వాటర్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందించడంతోపాటు, ప్రభుత్వం వారికి పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుందని ఈ సందర్భంగా మంత్రి మీడియాకు వివరించారు. తొలుత మంత్రి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసి అత్యవసర వార్డును పరిశీలించి పెషేంట్స్ కు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం నూతన మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి వెనుకవైపు నిర్మాణంలో ఉన్న మొదటి రెండవ ఏడాదికి సంబంధించి boys, girls హాస్టల్ ను, వైద్య విద్య కళాశాల భవన నిర్మాణాలను పరిశీలించారు.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత, ఎంపీ మార్గని భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ మురాలేదారన్ రెడ్డి, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడీ తదితరులు వున్నారు.