రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడం ద్వారా జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం కు నిదర్శనం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు.
సోమవారం గోదావరి గట్టు పై ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహా సెంటర్ నందు ఫూలే అంబేద్కర్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన్నారు. రాజమహేంద్రవరం లో ఫూలే అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని ఎంపి భరత్ నిర్ణయం అభినందనీయం అన్నారు. ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే భరత్ మంచి పార్లమెంటరీయన్ గా గుర్తింపు పొందారన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసినా ఏదో ఒక ఆర్జిని ఇవ్వడం చూస్తున్నామని, ఈ రోజు ఫూలే అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం శంఖుస్థాపన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చెయ్యడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం ద్వారా ఎంపి భరత్ రామ్ తన ప్రత్యేకత ను చాటుకోవడం జరిగిందని, ఇంత ప్రాధాన్యత కలిగిన కూడలిలో భవన నిర్మాణం కి స్థల కేటాయింపు ఇచ్చిన సహకారం అందించిన జిల్లా యంత్రాంగం, మునిసిపల్ కమిషనర్ కు మంత్రి కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ, బిసి ల కుల గణన కు కమిటీ వేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ లకు నిజమైన వారసుడు అన్నారు. ఈ నాలుగేళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలు అమలు కోసం దేశంలో నే రెండు లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేసిన ఏకైక వ్యక్తి మన జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి సంక్షేమం పట్ల ఎంతో చిత్తశుద్ధి వున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 200 ఏళ్ల కిందట పుట్టి మన వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు ఫూలే దంపతులు అన్నారు.
మన వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ తన గురువుగా ఫూలే ను పేర్కొనడం ద్వారా ఫూలే గొప్పతనం తెలియ చేస్తోందని పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే సతీమణి సావిత్రి బాయి ఫూలే ఆనాడు అణగారిన వర్గాల, స్త్రీ విద్య కోసం చేసిన కృషి సాక్షాత్తు మనపాలిట ఆధునిక సరస్వతి దేవి గా మంత్రి అభివర్ణించారు. మనందరి దైవం చదువుల తల్లి సరస్వతి అయితే, మన తరాల అభ్యున్నతికి పుట్టిన చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే గా మంత్రి పేర్కొన్నారు.
విద్య ద్వారానే వివేకం, స్థిరత్వం స్థిరత్వం వస్తుందన్నారో మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతులు చాటి చెప్పడం ద్వారా మహాత్మా బిరుదును పొందారని అన్నారు.నేడు ఎంతో మంది వెనుకబడిన కులాలు చెందిన మాలాంటి వాళ్ళం ఉన్నత పదవులలో ఉన్నామంటే ఆనాడు వారు చూపిన మార్గమే కారణం అని వేణుగోపాల్ తెలిపారు. రూ.825 లక్షలతో ఫూలే అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకోసం కృషి చేసిన ఎంపి భరత్ రామ్ చొరవను మంత్రి అభినందించారు.
ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు పూలే, అంబేద్కర్ సేవలు వినలేనివన్నారు. రాజమండ్రి లో గోదావరి గట్టున అప్పటి గావర్నర్ సుశీల్ కుమార్ షిండే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. చైతన్య నగరమైన రాజమహేంద్రవరంలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు అభ్యున్నతిగా జి ప్లస్ టు పూలే అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఐకాన్ కి ఈ భవన ఉంటుందని పేర్కొన్నారు. బలహీనవర్గాల కొరకు పూలే, అంబేద్కర్ ఎన్నో ఉద్యమాలు చేశారని వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం అన్నారు.
తొలుత మంత్రులు విడుదల రజిని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,తానేటి వనిత, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఆర్యపురం రోడ్డులో గల సాయి బ్లోమ్స్ మధర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిని ప్రారంభించారు.
కార్యక్రమంలో రుడ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కే.దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు మార్గాని నాగేశ్వరరావు, నయనాల కృష్ణారావు, అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.