Breaking News

ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటే సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చు

-ఉద్యోగులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య పరీక్షలు నిర్వహించి అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ చేసి రోగం ముదరకుండానే వారికి చికిత్స అందించే దిశలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే దిశలో అసంక్రమిత వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు తుడా సహకారంతో సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని వివిధ శాఖల సిబ్బందికి మరియు తుడా సిబ్బందికి డ్రై రన్ నిర్వహించి రక్త పరీక్షలు ఈసీజీ చేపట్టడం ఉద్యోగస్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యతగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోష దాయకం అని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు.

ముందుగా కలెక్టర్ వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి వారు బిపి, రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం జేసి డీకే బాలాజీ డిఆర్ఓ శ్రీనివాసరావు తదితర అధికారులు సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్లోని వివిధ శాఖల సిబ్బందికి మరియు తుడా సిబ్బందికి సుమారు 3000 రూపాయల విలువ చేసే రక్త పరీక్షలు మరియు ఈసీజీ పరీక్షలు తుడా సహకారంతో ప్రీవియ ఏజెన్సీ ద్వారా సోమవారం ఉదయం ఉచితంగా చేపట్టడం జరిగిందని, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ తో సంబంధిత ఉద్యోగుల వైద్య పరీక్షల నివేదికలు రెండు మూడు రోజులలో అందజేయడం జరుగుతుందని దీని వలన వారికి ఎవరికైనా ఏదైనా జబ్బులు ఉన్నట్లయితే రిపోర్టు ఆధారంగా తదుపరి చికిత్సలకు ముందస్తుగా వారు ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలు ఉంటుందని ఇది ఒక బృహత్తర కార్యక్రమం అని అన్నారు.

ఉద్యోగులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. డబ్బు కన్నా విలువైనది ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏనాడో పెద్దలు చెప్పారని అది ముమ్మాటికి నిజమని మనం ఆరోగ్యంగా ఉంటే మన విధులు సక్రమంగా నిర్వర్తించ గలుగుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తుడా,విసి హరికృష్ణ, డిఎంహెచ్ఓ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ప్రభావతి, ఎస్ డి సి భాస్కర్ నాయుడు, కోదండరామిరెడ్డి, కలెక్టరేట్ ఏవో జయరాములు, ప్రీవియ కంపెనీ ఎండి ఫణి,వారి వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *