తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు వరంగా, వారి ఆరోగ్యానికి భరోసా కల్పించే విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ లో చికిత్స అందించడం ద్వారా పేదవారికి కూడా మెరుగైన అధునాతనమైన వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోకి తేవడం జరిగిందని, ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రజలు తమ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులైన లబ్ధిదారులు ఆరోగ్యశ్రీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకొనుటకు క్రింద తెలపబడిన సేవల కొరకు వారి దగ్గరలోని గ్రామ,వార్డు సచివాలయాన్ని నిర్ణీత ధృవపత్రాలతొ సందర్శించి నిర్ధేశించిన రుసుము చెల్లించి మార్పులు చేసిన ఆరోగ్య శ్రీ కార్డును పొందవలెనని అన్నారు .
-ఆరోగ్య శ్రీ కార్డు నందు పేర్లు / వివరములు సవరణ చేసుకొనవచ్చును.
-ఆరోగ్య శ్రీ కార్డు పోయిన యెడల, నూతన కార్డు పొందవచ్చును.
-ఆరోగ్య శ్రీ కార్డు నందు మిగిలిపోయిన అర్హత గల కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చును.
-ఆరోగ్య శ్రీ కార్డు నందు కుటుంబ యజమాని ఫోటో మాత్రమే ముద్రించి యున్న వాటి స్థానంలో ఇప్పుడు కుటుంబసభ్యులు అందరి ఫోటో (FAMILY గ్రూప్ ఫోటో ను) ఆరోగ్య శ్రీ కార్డు పై పొందుపరచవచ్చునని తెలిపారు.
ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు.