రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపట్టిన 10 వ తరగతి విద్యార్థుల పేపర్స్ వ్యాలిడేషన్ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ పతరగతి పరీక్షా జవాబు పత్రాల మూల్యాంకన (వ్యాలీడేషన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారుల మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లను విద్యా శాఖ వివరించినట్లు తెలిపారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోల దేనని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖదికారి ఎస్. అబ్రహం ఉండి, మూల్యాంకన సమయంలో చేపడుతున్న బార్ కోడింగ్, డీకోడింగ్ విధానం పై వివరాలు తెలియచేశారు. జవాబు పత్రాలు దిద్దిన తరువాత మార్కుల జాబితాను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలియ చేశారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …