-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో భూ సేకరణ ప్రక్రియకు సంబందించి పెండింగ్ లో వున్న పనులను త్వరిత గతిన పూర్తి చెయ్యాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరకు సంబంధించి పలు అంశాల పై రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ రవాణా శాఖకు సంబంధించి రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్, ఆటో టెస్టింగ్ సంబంధించి భూ సేకరణ చేపట్టాలని రెవిన్యూ అధికారులు ఆదేశించారు. రాజమహేంద్రవరంలో అనువుగా ఉన్న 4 ఎకరాలు భూమి సిద్ధంగా ఉందని, కొవ్వూరులో భూసేకరణ చేయాల్సిందని ఆర్డీఓ వివరించారు. లాలా చెరువు దివాన్ చెరువు పై వంతెనల నిర్మాణం కొరకు భూసేకరణకు సంబందించిన డి.పి.ఆర్ డాక్యుమెంట్ సమర్పించాలన్నారు. నిర్మాణంలో ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్ డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత సృష్టి డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులు సమావేశాలకు హాజరై ఎప్పటికప్పుడు వాస్తవ ప్రగతి నివేదిక సమర్పించాలన్నారు. రోడ్లు రహదారులు ఆధ్వర్యంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) ద్వారా రాజానగరం నుండి సామర్లకోట వరకు నిర్మిస్తున్న 30 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి కి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఎన్ టి హెచ్, ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ, టెంపుల్ షిఫ్టింగ్ వంటి పెండింగ్ అంశాలు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులు సూచించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిని, (ఆర్ అండ్ బి) ఏపీఆర్ డి సి ఈ ఈ ఏ శ్రీకాంత్, డి ఈ పి. భాస్కర రావు, ఏ డి సర్వే లక్ష్మణరావు, రాజానగరం రంగంపేట తాసిల్దారులు పవన్ కుమార్, వి అమ్మాజీ పాల్గొన్నారు.