తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
2022-23 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏ.పి సి.ఎం కప్ టోర్నమెంట్‌ను 1 మే 2023 నుండి 05 మే2023 వరకు తిరుపతిలో పురుషులు మరియు మహిళల కొరకు 14 విభాగాలలో నిర్వహిస్తున్నామని, ఏర్పాట్లలో ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా చేపట్టలని జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి కె.వెంకటరమణా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో సిఎం కప్ టోర్నమెంట్ నిర్వహణపై ఏర్పాటు చేసిన వివిధ కమిటీల సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సిఎం కప్ టోర్నమెంట్ కు 13 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 4999 మంది క్రీడాకారులు హాజరు అవుతారని, అందులో ప్రతి జిల్లా నుంచి 178 మహిళలు, 179 పురుషులు వెరసి మొత్తం 357 మంది ఇలా ఉమ్మడి 13 జిల్లాల నుండి హాజరవుతారని, ఈ కార్యక్రమ ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాటు చేసిన కమిటీలు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి విజయవంతం చేయాలని తెలిపారు.
ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో కార్యనిర్వహక కమిటీ వివిధ కమిటీలను సమన్వయం చేసుకుని ఈ టోర్నమెంట్ విజయవంతంగా జరిగేలా కృషి చేయాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని ఫుడ్ కమిటీ, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి, చీఫ్ కోచ్ లతో ఏర్పాటై క్రీడాకారులకు, అధికారులకు, వచ్చే ప్రముఖులకు,సిబ్బందికి సమయానుసారంగా అల్పాహారం, భోజనం నాణ్యతగా, కూపన్ల పంపిణీ వంటివి సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాల కమిటీ లో పిడి డ్వామా, డిపిఓ, డిఎల్డిఓ తిరుపతి, శ్యాప్ ప్రతినిధులు స్టేజ్, వేదిక, బ్యాక్ డ్రాప్, మైక్ ఏర్పాట్లు, సీటింగ్ తదితర ఏర్పాట్లు చూడాలి అన్నారు. మీడియా కమిటీ లో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఈవెంట్ మీడియాలో కవరేజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవర్ సప్లై కమిటీ కొరకు పూర్తి బాధ్యత ఎస్ఈ,ఏపీఎస్పీడీసీల్
అని నిరంతర విద్యుత్ సరఫరా స్టేడియం, వసతి ప్రాంతాల్లో ఉండాలని, స్టాండ్ బై గా జనరేటర్ ఏర్పాటు ప్రారంభ, ముగింపు కార్యక్రమాల లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అగ్నిమాపక సేవల కమిటీలోని అగ్నిమాపక అధికారి తగినన్ని ఫైర్ ఫైటింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని, ప్రోటోకాల్ కమిటీ లో జిల్లా రెవెన్యూ అధికారి,ఆర్డీవో తిరుపతి, ఎస్డిసి తదితరులు ప్రోటోకాల్ సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని, టెండర్స్ కమిటీ జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత సామాగ్రిని నిబంధనల మేరకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు తో సిపిఓ పర్యవెక్షించాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి వారు వసతి కమిటీని సమన్వయం చేసుకుని టోర్ణమెంట్ లో పాల్గొనడానికి వచ్చే క్రీడాకారులకు, అధికారులకు సిబ్బందికి, ప్రముఖులకు వసతి ఏర్పాటు చూడాలని, రిసెప్షన్ రిజిస్ట్రేషన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ ద్వారా తగినన్ని బస్సులు ఏర్పాటుతో క్రీడాకారులను సంబంధిత క్రీడా ప్రదేశాలకు చేర్చేలా ఉండాలని తెలిపారు. వాటర్ కమిటీ ఎస్ఇ ఆర్ డబ్ల్యు ఎస్, నగరపాలక సంస్థ అవసరమైన మేరకు త్రాగునీటి ఏర్పాట్లు చూడాలని, పారిశుద్ధ్య కమిటీలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లా పంచాయతీ అధికారి సమన్వయంతో క్రీడా ప్రాంగణంలో, వసతి ప్రాంతాలలో పారిశుధ్యం ఎప్పటికప్పుడు సరిచూడాలని సూచించారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో తగినంత బందోబస్తును క్రీడా ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్డీవో తిరుపతి పర్యవేక్షణలో హెల్త్ కమిటీ క్రీడా ప్రదేశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటుతో తగినన్ని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మరియు ఎమర్జెన్సీ మందులతో ఏర్పాటు ఉండాలని, గ్రౌండ్ కమిటీ వారు క్రీడా ప్రాంగణం నిబంధనల మేరకు క్రీడలకు అనువుగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు మన జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో అందరూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి, ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ విజయకుమార్, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ శేషాచలం రాజు, సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, పిడి డి ఆర్ డి ఏ జ్యోతి, చీఫ్ కోచ్ సయ్యద్ హుస్సేన్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.