– భగీరథ మహర్షి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం
-భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన..
– జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత, జేసీ తేజ్ భరత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధించాలనే పట్టుదల, నమ్మకం, తన కఠోర తపస్సుతో జీవకోటికి ప్రాణాధారమైన గంగను దివి నుంచి భువి తెచ్చిన భగీరథ మహర్షి మన అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత లు పేర్కొన్నారు.గురువారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగీరథ మహర్షి జయంతిని పురష్కరించుకుని కలెక్టరు మాధవీలత, జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ జిల్లా అధికారులతో కలసి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ సర్వ జీవకోటికి ప్రాణాధారమైన పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహనీయులు అపర భగీరథుడు అన్నారు. భగీరథ మహర్షి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు. ఆయన పట్టుదలకు మారు పేరన్నారు. పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమైన భగీరధుని ఆదర్శంగా తీసుకొని సమాజం కొరకు సేవ చేయాలన్నారు. కఠోరశ్రమతో దేనినైనా సాధించగలమని భగీరథ నిరూపించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని తెలిపారు. వేలాది సంవత్సరాలు అయినప్పటికీ ఆయనను మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నామంటే ఆయన సంకల్పం ఎంతో గొప్పదో మనం అర్థం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్. మాధవరావు, ఏడీ సర్వే లక్ష్మణరావు, డీఎస్ఓ ప్రసాదరావు, అడ్మినిష్ట్రేషన్ అధికారి బీమారావు, కలక్టరేట్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …