Breaking News

విభిన్న ప్రతిభా వంతులపై ఎలాంటి వివక్ష చూపరాదు: జిల్లా రెవెన్యూ అధికారి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశము జిల్లా రెవెన్యూ అధికారి నివాసరావు అధ్యక్షతన కమిటీ సభ్యులతో నేటి గురువారం జరిగింది.జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డిఆర్ఓ జిల్లా స్థాయి కమిటి విధులను వివరించారు. ముఖ్యముగా వైకల్యము గల వ్యక్తులు ఎటువంటి వివక్షతకు గురికాకుండా, వారి హక్కులను పొందే విదముగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం లోను మరియు పాఠశాలల్లో వివక్షత రహితమైన పరిసరాలు కల్పించుటకు కృషి చేయాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలలోను విభిన్న ప్రతిభా వంతులకు 4 శాతం రిజర్వేషన్ అమలు పరచాలని ఆదేశించారు. అంతే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖలలోను 5 శాతం నిధులను విభిన్న ప్రతిభావంతుల పునరావాసం కొరకు కేటాయించవలసిందిగా తెలిపారు.ఈ సమావేశములో సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ నివాస్ మరియు జిల్లా అధికారులు, సూపరింటెండెంట్ వినోద్, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సి.యువరాజులు నాయుడు, రాష్ట్రీయ సేవ సమితి బాలకృష్ణ మూర్తి, పాస్ శివయ్య, నెహ్రు యువజన సేవ సంఘం మరియు విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, తులసిరాం, రమేష్. మనోజ్ రుకేష్, పద్మజ, విజయశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *