రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు కార్మిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విక్రమ హాల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు వారి హక్కులు మరియు సంక్షేమం కోసం చేయబడ్డ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తి అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా కార్మికులకు కల్పించబడిన హక్కుల గురించి వివరించారు. “అసంఘటిత కార్మికుల కోసం నల్సా వారి న్యాయ సేవల పథకం, 2015” గురించి అవగాహన కల్పించారు. కార్మికులకు ఎలాంటి సమస్య ఎదురైన జిల్లా న్యాయ సేవధికార సంస్థను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ సదస్సులో అసిస్టెంట్ కమిషనర్ ఒఫ్ లేబర్ బి.ఎస్.ఎం. వల్లి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికులది కీలక పాత్ర అని వారి సంక్షేమం మెరుగైన సమాజనికి దోహద పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, గోదావరి ఎలెక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సభ్యులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …