-వర్షాకాలం రాక ముందే కాలువల పూడిక తీత పనులు పూర్తి చేయాలని ఆదేశం.
-డ్రైన్ ల రిపేర్లు ఉంటే తక్షణమే పూర్తి చేయండి.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్టు అందిన సమాచారాన్ని తెలుసుకొని కమిషనర్ కె. దినేష్ కుమార్ హుటాహుటిన ఆ ప్రాంతాలను సందర్శించారు . నల్ల ఛానల్, కంబాలచెరువు, హైటెక్ బస్టాండ్ ,కృష్ణా నగర్ మున్నగు ప్రాంతాల ను సందర్శించి సానిటరీ వర్కర్ల ను అప్రమత్తం చేసి పలు సూచనలు జారీ చేశారు. డ్రైన్ లకు ఎక్కడైనా మైనర్ రిపేర్లు ఉంటే తక్షణమే పనులు చేపట్టమని ఆదేశించారు. వర్షానికి ఎక్కడా,ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ లేవని సిబ్బంది కమిషనర్ కు వివరించారు. వర్షాకాలం ప్రారంభం కాకుండా నే యుద్ధ ప్రాతిపదికన పూడిక తీత పనులు పూర్తి చేయమని ఇప్పటికే కమిషనర్ ఆదేశించారు. నగర పౌరులకు ఏ విధమైన అసౌకర్యం కలపకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీల పరిస్థితిని తమకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. నగర పౌరులు, వ్యాపారస్తులు కూడా డ్రైన్ ల లో కొబ్బరి బొండాలు, ఎటువంటి చెత్తాచెదారాలు వేయకుండా ఉండాలని ,నగరపాలక సంస్థ శానిటరీ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. కమీషనర్ పర్యటన లో ఎమ్ హెచ్ ఓ వి. వినూత్న,ఈ ఈ సాంబశివరావు లు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.