గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి సమస్యలపై అందే ఫిర్యాదులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, సచివాలయ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్ నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారం పట్ల భాధ్యతతో వ్యవహరించాలని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోనే పరిష్కరించాలన్నారు. స్పందనకు అందే ఫిర్యాదుల పై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారిగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ వార్డ్ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 29 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 14, ఇంజినీరింగ్ విభాగం 5, ప్రజారోగ్య విభాగం 1, రెవెన్యూ విభాగం 5, ఉపా సెల్ విభాగం కి సంబధించి 3, అకౌంట్స్ విభాగం సంబంధించి 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్, ఏడిహెచ్ రామారావు, మేనేజర్ శివన్నారాయణ, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సిటి ప్లానర్లు, ఏసిపిలు, ఈఈలు, యస్.యస్ లు, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …