రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రకాష్ నగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. అనంతరం బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారికి అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. అనంతరం బాలుర పర్యవేక్షణ గృహమును సందర్శించిన న్యాయమూర్తి అక్కడి వసతులను పరిశీలించి బాలురుతో కాసేపు మాట్లాడారు. శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. న్యాయ మార్గాన్ని అనుసరిస్తే జీవితంలో ప్రశాంతత, గౌరవం లభిస్తాయని లేదంటే జీవితం దుర్బలం అవుతుందని వివరించారు. వారికి ఎలాంటి న్యాయ సేవలు కావాలన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి తెలియజేయాలన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …