-రాష్ట్ర ఫ్యామిలీ కాన్సెప్ట్ నోడల్ అధికారి డా. రమేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం షెడ్యూలు ప్రకారంగా ప్రతి సచివాలయాల్లో పరిధిలో కార్యచరణ ప్రణాళికతో అమలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ అధికారి మరియు జాయింట్ డైరెక్టర్ డా. టి. రమేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయము నందు ప్రోగ్రాం ఆఫీసర్స్ వైద్యులు, వైద్య సిబ్బందితో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కార్యాచరణ పై పై సమీక్ష నిర్వహించి తగిన సూచనలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమం షెడ్యూలు వేయబడిన ప్రకారంగా ప్రతి సచివాలయాల్లో జరిగించాలన్నారు. అదేవిధంగా వైద్య సేవలు, 63 రకాల వైద్య పరీక్షలు 105 రకాల మందులు తో ప్రజలకు సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సేవలు అందించిన పిదప ఆ వైద్య సేవలను పోర్టల్ నందు నమోదు చేయాలన్నారు. వెబ్ పోర్టల్ నందు నమోదు చేయడం వలన జిల్లా ప్రగతి పోర్టల్ నందు ప్రదర్శించబడుతున్నదని తెలియజేశారు. ఫ్యామిలీ కాన్సెప్ట్ ప్రతి వైద్యాధికారి స్థానికముగా ఉన్న రోగుల పేర్లతో సహా గుర్తుపెట్టుకుని వారిని పేర్లతో పలకరించే విధముగా ఆ ప్రదేశములలో వైద్య సేవలు అందించాలన్నారు. ఈ విధంగా గ్రామాలలో వైద్య సేవలందించడం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యామిలీ కాన్సెప్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వైద్యాధికారులు వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజా ఆరోగ్య రక్షణకు కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. వెంకటేశ్వరరావు DLATO Dr N వసుందర,DSO డాక్టర్ టి రాజీవ్ ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక , శ్రీ సుధీర్ మరియు ఇతర వైద్య అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.