నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్త్రీ రక్షణ లేని స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం కానే కాదని. గాంధీ కలలు కన్న నిజమైన స్వాతంత్య్రం ఇదేనా! అని గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్టు వ్యవస్థాపక నిర్వాహకులు ఆర్ఆర్ నాగరాజన్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఆయన శుక్రవారం దండు యాత్ర -2 లో భాగంగా సత్యాగ్రహ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దీక్షలు ఈనెల 11వ తేదీ వరకు నిర్విరామంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మంచి ఓటు మనం వేద్దాం అది మంచి వ్యక్తికే వేదం అని పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం మత్తుపదార్థం సంపూర్ణంగా జరిగినప్పుడే ప్రజలు సుభిక్షంగా ఆనందంగా ఉండగలుగుతారని ఆయన సూచించారు .స్త్రీలు బానిసత్వం నుంచి బయటికి రావాలంటే మద్యపాన నిషేదమే మార్గమని అన్నారు. ప్రభుత్వం మద్యపాన నిషేదం తొలగించకపోతే, ప్రజలే మద్యపాన నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆయన మండుతున్న ఎండలో కూర్చుని దీక్షలకు శ్రీకారం చుట్టారు. మద్యపానానికి బానిసైన వారి అనేక కుటుంబాలు ఇప్పుడు ఎన్నో నాశనమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధి వున్నవాడు అయితే మద్యపానం నిషేదం చేస్తాడని చెప్పిన ఆనాటి ముఖ్యంత్రిని ప్రశ్నించిన ఈనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ విషయం మరిచి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ప్రశ్నించారు. స్వాతంత్య్ర భావాలతో ఆనాడు గాంధీ తో ఎంతో మంది కలిసి పోరాడారు మరి ఈనాడు దోపిడిదారులు నాయకులుగా ఎన్నుకుంటున్నాము. కారణము డబ్బు తీసుకొని ఓటు వేయటమే ముఖ్య కారణం ఎంతో మంది స్త్రీలు తాలి తెగిపోతుంటే చిన్న వయస్సులో విధవగా మారుతుంటే వారి పిల్లల జీవితాలు బలైపోతుంటే ప్రభుత్వాలకు జాలి, దయ లేదని ధ్వజమెత్తారు. మానవత్వం లేదు, ఇచ్చిన మాట కాపాడే నాయకుడు లేరు. వారు కంటే బిడ్డలు మనం కంటే గొడ్డులా ఇది ఇనాటి మన ప్రజాస్వామ్యం. స్వార్ధపు రాజకీయాలకు సమాధి కడదాం. స్వాతంత్ర్య భావాలకు బలమైన పునాది వేద్దాం! నాయకుడంటే డబ్బును ప్రేమించేటి వాడు కాదు అని గుర్తించాలి. ప్రజలను ప్రేమించే వాడే నాయకుడని వివరించారు. “చీకటి నుండి వెలుతురుకొ”, “కల నుంచి నిజానికి”.. “మరణం నుండి అమరత్వానికి” అని చెప్పిన గాంధీ మాటలను మనం మరిచిపోతున్నాం. ఓటు అనే ఆయుధాన్ని మీ చేతికిచ్చాను దాన్ని సరిగ్గా ఉపయోగించి రాజుగా బ్రతుకుతారో లేదు అమ్ముకొని బానిసగా బ్రతుకుతారో అది మీ చేతిలో వుంది. అన్న డా॥ బి. ఆర్. అంబేడ్కర్ మాటలను మరిచాము. మరి ప్రజాస్వామ్యానికి రక్షణ ఏది? ప్రజాస్వామ్య రక్షణ, ప్రజల రక్షణ అని ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి నాలుగో. స్తంభం పత్రికా ముఖమని అది కూడ చాలా వరకు కార్పొరేటు కంపెనీలుగా మారాయన్నారు. దీన్ని కాపాడలని ప్రజలను వేడుకుంటున్నావన్నారు. ప్రజా స్వామ్యాన్ని రక్షించమంటున్నారు. మద్యపానాన్ని నిషేదించమంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రిలే దీక్ష మూలంగా తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ట్రస్టు రాష్ట్ర అధ్యక్షురాలు బాపతి భారతి, ట్రస్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Tags nellore
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …