Breaking News

న్యాయ సేవాధికార సంస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

-ఆధునీకరించి డి ఎల్ ఎస్ ఎ సమావేశ మందిరం ప్రారంభించిన ఎస్ ఎల్ ఎస్ ఎ చైర్మన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశం లో పుట్టిన ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, గూడు కలుగ చెయ్యాలంటే న్యాయం జరిగినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని, వారి ఆర్థిక, సామాజిక హోదా ఆధారంగా కాకుండా , వారి హక్కుగా అది న్యాయం జరిగినప్పుడే సాధ్యం అవుతుందని ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ &  హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం డి ఎల్ ఎస్ ఎ కార్యాలయంలో ఆధునీకరించిన   న్యాయ సేవా సదన్ సమావేశ మందిరం ను ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ &  హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి ప్రారంభించగా,   హై కోర్టు జడ్జి జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాద్ రాయ్, హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి మాట్లాడుతూ , ప్రతి ఒక్కరికీ “రైట్ టూ లైఫ్ ” కల్పించడం కోసం దేశంలో వ్యవస్థలు సక్రమంగా పని చేయడానికి డా బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కారణం అని, ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉండాలన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రూపొందించడం జరిగిందన్నారు. ఏ భారతీయుడు ఆర్థిక, సామాజిక స్థితి కారణంగా అన్యాయానికి గురి కాకూడదు అని రాజ్యాంగం ఆర్టికల్ 39 (ఏ) అంబేడ్కర్ రూపొందించడం జరిగిందన్నారు. తదుపరి జాతీయ లోక్ అదాలత్, న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా సత్వర న్యాయం సాధ్యం అవుతున్నట్లు తెలిపారు.  జిల్లా స్థాయిలో న్యాయం కోసం వచ్చే వారికి డి ఎల్ ఎస్ ఎ ద్వారా అందచేస్తున్న సేవల పట్ల డి ఎల్ ఎస్ ఏ చైర్మన్ సునీత గంధం, కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి, లను అభినందించారు. తొలుత సభ్యత, సాంస్కృతికి మారుపేరు అయిన రాజమండ్రి నగర వాసులకు నమస్కారములతో గౌరవ జస్టిస్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

తూర్పు గోదావరి జిల్లా పరిపాలన జడ్జి & హైకోర్టు జడ్జి జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాధ్ రాయ్ మాట్లాడుతూ, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జాతీయ, రాష్ట్ర,  జిల్లా, మండల పరిధిలో సత్వర న్యాయం సాధ్యం అవుతొందన్నారు.  స్వాతంత్య్రం వచ్చిన 37 ఏళ్ల తరువాత ఆర్థిక అసమానతలు కారణం ఏ ఒక్కరికీ, పేద వారికి న్యాయం లభించ కుండా ఉండరాదనే జస్టిస్ భగవత్ ఆలోచనతో న్యాయ సేవాధికార సంస్థ రూపుదిద్దుకుంది అని అన్నారు. 1987 లో దీనికి చట్టబద్దత కల్పించడం జరిగిందన్నారు. మార్జినల్ గ్రూప్ లలో ఉండే ప్రజలకు ముఖ్యంగా మహిళలకి, పిల్లల కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారని అన్నారు. న్యాయ పరమైన చట్టాలు, హక్కులపై అవగాహన లేకపోవడం చాలా మందిని అందుకోలేక పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ “లీగల్ లిటరసీ” పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మల్లికార్జునరావు మాట్లాడుతూ,  మూడు దశాబ్దాల క్రితం న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థ లో ఉండే వాళ్ళు కొత్త చట్టాలు అమలు చేయడం ద్వారా న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందన్నారు. సమాజంలో న్యాయం కోసం ఎదురుచూసే వ్యక్తులకు,అర్హులకు సత్వర న్యాయం కోసం అమలు చేస్తున్న చట్టాలను సమర్థవంతంగా, వినూత్నమైన ఆలోచన ద్వారా అందచెయ్యవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత గంధం మాట్లాడుతూ,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సత్వర న్యాయం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ దిశలో సమావేశాలు, కార్యశాలలు నిర్వహించి ప్రజల్లో న్యాయ వ్యవస్థ, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది గౌరవ హై కోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా డి ఎల్ ఎస్ ఏ కార్యాలయ భవనంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శంఖుస్థాపన చెయ్యడం జరిగిందన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ చైర్మన్, హై కోర్టు జడ్జి లు చేతుల మీదుగా ఆధునికత తో రూపుదిద్దుకున్న సమావేశ మందిరం ప్రారంభించి అందుబాటులోకి తీసుకుని రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.  అర్హులకి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో తల్లి తండ్రులను కోల్పోయిన 9 మంది పిల్లలకు జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి వారికి రూ.10 లక్షల చొప్పున రూ.90 లక్షలు అందజేస్తున్నామన్నారు. ఈ మొత్తం డిపాజిట్ చేసి వారికి అందచెయ్యడం జరుగుతోందని అన్నారు. అనంతరం గౌరవ జడ్జి ల సమక్షంలో లబ్ధిదారులకు డిపాజిట్ చేసిన బాండులను గౌరవ జడ్జిలు చేతుల మీదుగా అంద చేయ్యాడం జరిగింది. తొలుత జిల్లా కోర్టు ప్రాంగణానికి చేరుకున్న గౌరవ హై కోర్టు న్యాయమూర్తు లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, తదితరులు ఆహ్వానం పలికారు. అనంతరం పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం జరిగింది. తదుపరి గౌరవ హై కోర్టు న్యాయ మూర్తులు కోర్టు అవరణలో చెట్లు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత, డిఎల్ఎస్ఎ సెక్రెటరీ కె. ప్రత్యూష కుమారి, పలువురు న్యాయ మూర్తులు ఎమ్. నాగేశ్వర రావు, పి ఆర్ రాజీవ్, యూ యూ ప్రసాద్, శ్రీమతి ఎ. గాయత్రి దేవి లు , ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్ర వరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీ యు వి బి రాజు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *