-జేకేసి ద్వారా మనపై మరింత బాధ్యత పెరిగింది
-1902 కి వచ్చే ఫిర్యాదుల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కే చెబుదాం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారం చేసే విధానంలో మనపై మరింత బాధ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు . మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జగనన్న కే చెబుదాం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లి లోని సిఎం విడిది కార్యాలయం నుంచి జగనన్న కే చెబుదాం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపడం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు జేకేసి కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు “జగనన్న ” పేరున ఉండడం తో మనపై మరింత బాధ్యత తో పాటుగా జవాబుదారీ తనం కూడా పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవ అందచెయ్యల్సి ఉందన్నారు. వారి సమస్యలకి పరిష్కారం మరింత జవాబుదారీతనం తో చెయ్యాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి లో కాకుండా క్షేత్ర స్థాయి, గ్రామ స్థాయి వరకు అర్హులైన ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క సమస్యను మన సమస్యగా పరిగణించవలసిన అవసరం ఉందన్న విషయం ను ముఖ్యమంత్రి స్పష్టం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా, డివిజన్, మండల మండల కేంద్రాల్లో మానిటరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ సి హెచ్ సుదీర కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, డీఆర్వో జె , నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు