కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబంలోని పెద్ద కొడుకు బాధ్యత తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం వెనుక ఎంతో దూరదృష్టి, ప్రజల భవిష్యత్ అవసరాల గుర్తించి ప్రవేశపెడుతున్నారన్నారు. ఇందులో భాగంగా పేదింటిలో ఆడపిల్ల పెళ్లి కుటుంబానికి భారం కాకూడదన్న తపనతో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోపా పథకాలను 01 అక్టోబర్, 2022 నుండి మొదలు పెట్టారని తెలిపారు. హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కళ్యాణమస్తు ఆర్థిక సాయాన్ని మంగళవారం నాడు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కొవ్వూరు నియోజకవర్గంలో కళ్యాణమస్తు రెండో విడత ప్రొత్సాహకంగా 68 మంది లబ్ధిదారులకు రూ.57లక్షల 20 వేల చెక్ ను అందజేశారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అనేది పెద్దల నానుడి అని, ఈ రెండింటిని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపారన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా ఇళ్లు, ఇళ్లపట్టాలను మహిళలకు పుట్టింటి కానుకగా ఫ్రభుత్వం ఇచ్చిందన్నారు. అలాగే పెళ్లి కోసం కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. లబ్ధిదారుల కుటుంబాలకు, నాయకులకు పథకం యొక్క లక్ష్యాలు, నిబంధనలను వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడానికి, స్కూళ్లలో డ్రాపౌట్స్ తగ్గించి బాలికా విద్యను ప్రొత్సహించడానికి వరుడు, వధువులు ఇద్దరూ పదవ తరగతి తప్పనిసరి అనే నిబంధంన పెట్టామని తెలిపారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులను చేస్తూన్నారంటూ ప్రతిపక్ష వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఏ అవకాశం లేని ప్రతిపక్షం దీనిపై విమర్శలు చేయడం వారి చౌకబారుతనాన్ని తెలియజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా సమయంలో కూడా సంక్షేమాన్ని అందించామన్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందించామని తెలిపారు. వైఎస్సార్ కళ్యాణమస్తు కింద SC/ST లకు రూ. లక్ష పెళ్లి కానుక, కులాంతర వివాహం చేసుకున్న SC/ST లకు లక్షా 20 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద లక్షా 50వేల రూపాయలను ఇస్తున్నామని వివరించారు. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇస్తున్నామని హోంమంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇవ్వలేకపోయిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే ఆలోచనలు చేసి పథకాలు అమలు చేసిందని ఆరోపించారు. వధువుకి 18 సంవత్సరాలు, వరుడుకి 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లిళ్లకు పెద్దలు ప్రొత్సహించాలని తల్లిదండ్రులకు హోంమంత్రి సూచించారు. తమ కుటుంబాల కోసం, తమ కోసం నిరంతరం ఆలోచనలు చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆనందాన్ని సభికులతో పంచుకున్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …