Breaking News

రెడ్ క్రాస్ అవార్డ్ తీసుకున్న జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ను సత్కరించిన అధికారులు

-ఈ అవార్డ్ మనందరిది… మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా అధికారులందరీ సమిష్టి కృషితో తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ కి ప్రతిష్టాత్మ కమైన అవార్డ్ రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డ్ తీసుకున్న సందర్భాన్ని కలెక్టర్ ను ఎస్పీ, ప్రజా ప్రతినిధుల సమక్షంలో జిల్లా అధికారులు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాకు ప్రతిష్టాత్మకమైన రావడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వల్ల, మీ అందరి తరపున గవర్నర్ చేతుల మీదుగా అవార్డ్ తీసుకుని రావడానికి మీ ప్రతినిధిగా హజరవ్వడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన ఏడాది కాలంలో రెడ్ క్రాస్ యూనిట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చెయ్యడం వల్ల ఇంకా ఎన్నో రకములైన ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ప్రజల నుంచి, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ సంస్థలు ఇచ్చిన ప్రోత్సహం కూడా ఒక ముఖ్య కారణం గా కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే రకమైన స్ఫూర్తిని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని కోరారు. జిల్లాకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ యూనిట్ పరికరములు వచ్చిన రెడ్ క్రాస్ యూనిట్ సరైన సమయంలో స్పందించ లేదని అధికారులు తెలియ చేశారు. కొత్తగా జిల్లా ఏర్పాటు నేపథ్యంలో జిల్లా యూనిట్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలియచేశారు. జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ ద్వారా మరిన్ని ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేద్దాం అని కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లాకు పూర్తి స్థాయి కి ఎస్పీ సుధీర్ కుమార్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

రానున్న రోజుల్లో ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, యువ రెడ్ క్రాస్ సభ్యులకు శిక్షణా కార్యక్రమాలను, ప్రకృతి విపత్తుల నిర్వహణ, మాదక ద్రవ్యాలు నిరోధం, మొక్కలు నాటే కార్యక్రమం, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, రక్త దాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, ప్రత్యేక జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల సందర్భంగా కార్యక్రమాలు , శుభ్రత పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు, తదితర సమాజ హితమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా జిల్లా యూనిట్ పటిష్టం చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ సి హెచ్ సుదీర కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, డీఆర్వో జె , నరసింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు , కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *