Breaking News

బంగారు కొండ కింద స్వీయ పర్యవేక్షణలో పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపరిచే దిశలో అడుగులు..

-జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రజలు అధికారులు, భాగస్వామ్యంతో ఆలోచన చేపట్టనున్నాం..
-మండల స్థాయిలో సోమవారం ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలి..
-కలెక్టరు మాధవీలత, జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పౌష్టీకాహరం లోపం, రక్తహీనత లోపం ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత చేపట్టే దిశలో “బంగారుకొండ” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నామని జిల్లాలో కలెక్టర్ డా.కే. మాధవీ లత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశమందిరంలో జాయింట్ కలెక్టరు ఆధ్వర్యంలో సమన్వయం శాఖల అధికారులతో బంగారు కొండ కార్యక్రమ అమలు పర్యవేక్షణ విధివిధానాల పై జిల్లా కలెక్టరు అధ్యక్షతన సమీక్షించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టరు డా. కే.మాట్లాడుతూ జిల్లాలో పౌష్టికాహార లోపం, రక్తహీనత, వయస్సు తగ్గ – ఎత్తుకు తగ్గ బరువు తదితర అంశాల ప్రాతిపధికన ఆయా కేటగిరిల్లోని పిల్లలను గుర్తించి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దే క్రమంలో “బంగారుకొండ” అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కార్యక్రమం అమలు తీరుపై కూలకుషంగా చర్చించి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను ఆయా కేటగిల్లోని పిల్లలను గుర్తించి దత్తత తీసుకోవాడం ద్వారా వారిని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యం అన్నారు. జిల్లాలో 85,667 మంది చిన్నారులుండగా వీరిలో పౌష్టికాహార లోపం బలహీనంగా ఉన్న కేటగిరిలో 1733 మంది పిల్లలను గుర్తించామన్నారు. జిల్లాలోని సచివాలయ వారీగా పిల్లలను గుర్తించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధానంలో అడుగులు వేస్తున్నామన్నారు. ప్రజలను, స్వచ్చంద సంస్థలను, పారిశ్రామిక వేత్తలను, అధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఇందులో భాగస్వామ్యం చేసే ఆలోచన చేస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. బంగారుకొండ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోనికి తీసుకు వెళ్లడానికి ఒక పేరును సూచించి ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకు వెళ్ళడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఆదిశలో మరింత పోషక విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని అదనంగా అందించేందుకు జిల్లాలో బంగారు కొండ కార్యక్రమం కింద ఔత్సాహుకులను భాగస్వామ్యులు చేస్తున్నామని కలెక్టరు మాధవీలత తెలిపారు. అటువంటి చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు స్వీకరించేవారు తగిన సమయం, ఆసక్తి, ఆప్యాయత, శ్రమ, పోషకాహారం కొరకు సహకరించండం కూడా ముఖ్యమైన అంశంగా కలెక్టరు పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టరు ఎన. తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయోగాత్మకంగా జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అధికమిచడం, రక్తహీనతను, పెరుగుదలకు సంబందించి విన్నూత్న ఆవిష్కరణ చేయడంతో మరింత ముందడుగు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలోని సచివాలయాలు వారీగా అటువంటి పిల్లలను గుర్తించి స్వీయ పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈదిశలో ఒక పిల్లవాడి యొక్క పూర్తి సంరక్షణా భాద్యతలను చేపట్టడం పర్యవేక్షణ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో పిల్లలను గుర్తించే భాద్యతను చేపట్టి ఆ మేరకు కార్యచరణ ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. శిశు సుధా కింద బిడ్డ యొక్క బరువు, పెరుగుదల, పౌష్టికతత్వం తదితర అంశాలపై కూలం కుషంగా నివేదిక రూపొందించుకోవాలన్నారు. మన ఇంటి పెరటిలోనే ఉన్న ఎన్నో పౌష్టిక విలువలు కూడిన ఆహారాన్ని అందించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్రవర్షిణి, ఐసీడీఎస్ పీడీ కె. విజయకుమారి, వైద్యఆరోగ్య శాఖాధికారి డా. ఎన్. వసుంధర, ఇతర జిల్లా అధికారులు, ఐసీడీఎస్, మెడికల్ తదితర క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *