-అనాధ బాలుడు వైద్య ఖర్చుల చెల్లింపునకు హామీ
-మానవత్వం చాటుకున్న జెసి తేజ్ భరత్
-వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు
-జాయింట్ కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నామవరం కు చెందిన అనాధ బాలుడు ఎమ్ చరణ్ కుమార్ గురువారం ఆడుకుంటూ ప్రమాదవసాత్తు కాలువిరిగిన విషయం తెలుసుకుని రక్షణ వైద్య సేవలు అందించడం జరుగుతోందని , ఆరోగ్యశ్రీ ద్వారా అండగా నిలిచినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం దానవాయిపేట లోని విజయ్ హాస్పిటల్ కు చేరుకొని బాబును జెసి పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ వివరాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్యం అందించడం జరుగుతోందని అన్నారు. కొందరికి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు పొందలేక పోతున్నారని తెలిపారు. నామవరము కి చెందిన ఎం. చరణ్ కుమార్ తల్లిదండ్రులను కోల్పోయి, తన అమ్మమ్మ వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కాలు విరిగిపోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వైద్యం కోసం ప్రవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా ఆరోగ్యశ్రీ కార్డు లేనందున ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ వారు బాబుకు ఆపరేషన్ చేయలేమని తెలిపారు. బాబు సీరియస్ కండిషన్ చూసి దానవాయిపేట లోని విజయ్ హాస్పిటల్ లో బాబుకు వైద్య సేవలు కోసం ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కు ధరఖాస్తు చెయ్యడం జరిగింది. వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ బాబు పేరు నమోదు కు చర్యలు తీసుకుంటామని, వైద్య సేవలు పరంగా అయిన ఖర్చు మొత్తం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి వర్గాలకు హామీ ఇవ్వడం జరిగింది. తక్షణం స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడానికి అనుమతి ఇచ్చినట్లు జిల్లా వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ డా. పి. ప్రియాంక జాయింట్ కలెక్టర్ కు వివరించారు.
అంతకు ముందు అయితే మూడు రోజులలో అప్రూవల్ వస్తే ఆపరేషన్ చేస్తామన్నారని ఆసుపత్రి వర్గాలు చెప్పిన విషయాన్ని డి సి పి సి సభ్యులు అనంతరావు మెసేజ్ ద్వారా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కి తెలిపారు. ఆ మెసేజ్ లో సదరు బాబు తల్లి తండ్రి లేని అనాధ అని చాల పేదరికంలో ఉన్నారని తెలియ చేశారు. సదరు బాబు పరిస్థితికి చలించిన జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ వెంటనే తన ఉదారతను చాటుకున్నారు. వెనువెంటనే బాబుకు హాస్పిటల్ లో చికిత్స చేయించమని , ఆరోగ్యశ్రీ రాకపోయినా అందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మెసేజ్ లో తెలిపారు. వెంటనే అనంతరావు హుటాహుటిన విజయ హాస్పిటల్ కు వెళ్లి అక్కడ ఏర్పాట్లు చేసి రాత్రికి ఆపరేషన్ పూర్తిచేయించారు. వై ఎస్ ఆర్ రోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. డిసిపిసి మెంబర్ గొట్టిముక్కల అనంతరావు, ఆరోగ్యశ్రీ డీసీ పి. ప్రియాంక, హాస్పిటల్ ఎండి డాక్టర్ రామారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.