రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు సమీపములో శుక్రవారం ఒక్క అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం నెం. AP 39 TH 7141 లో పి.డి.ఎస్(చౌక బియ్యం) తో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు అశోక్ లేలాండ్ దోస్త్ వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 60 బస్తాలలో సుమారు 3.000 మెట్రిక్ టన్నుల పి.డి.ఎస్ బియ్యంను గుర్తించటమైనది. కాకినాడ జిల్లా లోని పిఠాపురం మండలంలోని బి.ప్రత్తిపాడు గ్రామమునకు చెందిన ఊట మణికంఠ వారి ఆదేశాల మేరకు బి.ప్రత్తిపాడు గ్రామమునకు చెందిన వాహన డ్రైవర్ ఊట అది విష్ణు వారు ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలోని కొక్కిరపాడు గ్రామములోని మూడు ప్రాంతాల నుంచి బియ్యం బస్తాలను ఎక్కించుకుని బి.ప్రత్తిపాడు గ్రామమునకు తరలిస్తున్నాడు. సదరు బియ్యం రవాణాకు సంబందించి సరైన బిల్లులు లేనందున సివిల్ సప్లయ్స్ అధికారులు, రాజమహేంద్రవరం రూరల్ వారు సుమారు రూ 6,20,000/- లు విలువ గల వాహనంను మరియు అందులో గల 3.000 మెట్రిక్ టన్నుల పి.డి.ఎస్(చౌక బియ్యం)ను సీజ్ చేసి 6-ఏ క్రింద కేసు నమోదు చేసి, PDS బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వాహన డ్రైవరు, ఓనర్, బియ్యం ఓనర్ మరియు సంబందిత వ్యక్తుల పై క్రిమినల్ కేసు నమోదు కొరకు రాజమహేంద్రవరం-III టౌన్ పోలీసు స్టేషన్ కు సిఫారసు చేసియున్నారు.
ఈ సందర్భముగా ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె కుమార్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో పి.డి.ఎస్(చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా పై నిరంతరం నిఘా కొనసాగుతుంది అని, ఎవ్వరైనా పి.డి.ఎస్(చౌక బియ్యం) కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపియున్నారు. ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, కానిస్టేబుల్స్ వలీ, వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.