రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాలు పడినప్పుడు రైతు నష్టపోకుండా ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ అన్నారు . కళ్లెం వద్ద ఉన్న ధాన్యం దగ్గరలో గల మిల్లుకు తరలించేలా ప్రభుత్వం అఫ్ లైన్ సౌకర్యం కల్పించింది, రైతులు ఆ సౌకర్యాన్ని వినియోగించుకో వలసినదిగా తెలియచేశారు. శుక్రవారం రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన. ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది….రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దు…
రైతులు మిల్లర్ల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-2023 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 3.32 లక్షల మెట్రిక్ టన్నులు. వర్షాలు పడినప్పుడు రైతు నష్టపోకుండా ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కళ్లెం వద్ద ఉన్న ధాన్యం దగ్గరలో గల మిల్లుకు తరలించేలా ప్రభుత్వం అఫ్ లైన్ సౌకర్యం కల్పించింది, రైతులు ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవలసినదిగా తెలియచేశారు. ఈరోజు నాటికి 30,978 మంది రైతుల నుంచి 2,05,584.300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జెనరేటు చేయడం జరిగింది. జిల్లాలో ఈ రోజు ఆన్ లైన్ లో 1896.720 మెట్రిక్ టన్నుల ధాన్యం మరియు ఆఫ్ లైన్ లో 2967.500 మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం కలిపి ఈ రోజు వరకు 18297 రైతుల నుండి 165788.280 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది.
ఇందుకు గాను ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలోపే 4776 FTO లకు గాను 65.33 కోట్ల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు జమ చెయ్యుట జరిగినది మరియు 14889 FTO లకు గాను 184.57 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు రాబోయే 2రోజులలోపు జమచేయబడును. రైతులు తమ ధాన్యాన్ని 17% తేమ వరకు ఆరబెట్టుకొవాలి. రైతులకు ధాన్యం రవాణాకు సంబంధించి గోనె సంచుల వినియోగ ఛార్జీలు రూ. 3.39 పై., @ ఒక్కింటికి, హమాలీ ఛార్జీలు రూ 22/- @ ఒక క్వింటాకు చొప్పున ప్రభుత్వం చెల్లించబడును. ఎక్కడా కూడా గోనెసంచులు, హమాలీ మరియు రవాణా కొరత రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎవరైనా రైసుమిల్లరు డబ్బులు డిమాండ్ చేసినట్లయితే సంబంధిత మండల అధికారికి లేదా కలెక్టరేటు కంట్రోల్ రూము నందు గల టోల్ ఫ్రీ నంబరుకు తెలియచేయగలరు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు మరియు ఫిర్యాదుల కొరకు జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో కలదు.
కంట్రోల్ రూమ్ నంబర్లు :- 8309487151 మరియు 0883-2940788.