Breaking News

8వ జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ది కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఔత్సాహిక పారిశ్రామికీకరణకు జిల్లాలో అనుకూలమైన వాతావరణం ఉందని ఆదిశలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను లక్ష్యాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో 8వ జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశంలో 9 అంశాల అజెండాగా పరిశ్రమలు, బ్యాంకింగ్, ఇతర అనుబంధ శాఖలతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో 3783 వివిధ స్థాయిల్లోని పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా రూ. 630.76 కోట్ల తో 15,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు జిల్లాలో కల్పించామన్నారు. ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 230 కోట్ల తో 194 పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా 516 మందికి ఉపాధి కల్పించా మన్నారు. జిల్లాలో మరో 3 భారీ పరిశ్రమలు ఏర్పాటును రూ.1660 కోట్లతో ఏర్పాటుచేయడం జరుగుతుందని, తద్వారా 2691 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. త్రివేణి రెన్యూవబుల్ పరిశ్రమ ద్వారా 2600 మందికి, జాగృతీ బయోటెక్ ద్వారా 81 మందికి అస్సాగో పరిశ్రమ ద్వారా 210 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా 67 పరిశ్రమలకు కేవీఐసీ ద్వారా 15 పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో ఇప్పటి వరకు 45 పరిశ్రమలుకు మంజూరు ఉత్తర్వులు జారీ చేసామన్నారు. సింగిల్ విండో విధానంలో 646 ప్రతిపాధనలు గాను ఇప్పటి వరకు 591 కి అనుమతులు జారీ చేయాసామని కలెక్టరు మాధవీలత తెలిపారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ 27 పరిశ్రమలకు సంబందించి రూ. 3.28 కోట్ల మేర ప్రోత్సాహకం అందించేందుకు ఈ రోజు కమిటీ సమావేశంలో సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ది దిశలో 294 యూనిట్లను గుర్తించి 241దరఖాస్తులను బ్యాంకులకు సిఫార్సు చేసామన్నారు. వాటిలో 143 యూనిట్స్ కు సంబందించి బ్యాంకులు రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో డి ఐ వో కే. వేంకటేశ్వర రావు, జిల్లా సూక్ష్మ పరిశ్రమల అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్ కార్పోరేషన్ అధికారి, ఎస్. రామ మోహన్, గ్రౌండ్ వాటర్ అధికారి వై.శ్రీనివాస్, మత్స్య శాఖ అధికారి డిగోపాల రావు, కేవీఐబీ బ్యాంక్ ఏడీ ఏ. సుబ్బారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు ఈఈ మీరా సుభాన్ షేక్, డిప్యూటీ కమీషన్ సేల్స్ ట్యాక్స్ పి. పుల్లయ్య, సహాయ హర్టికల్చర్ అధికారి డి సుధా కుమార్, ఏపీ ఎస్ ఎఫ్ సి బ్రాంచి మేనేజర్ జి.కే. రావు, ఎస్సీఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్. వెంకటేశ్వరరావు, పరిశ్రమల తనిఖీ అధికారి ఏ. శ్రీనివాసరావు, దేవాంగ కార్పోరేషన్ డైరెక్టరు కే. మల్లేశ్వరి, డిఆర్డీఏ తరపున బి. హేమంతు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *