Breaking News

తిరువూరులో ఆస్టర్ రమేష్ అమరావతి హాస్పిటల్

-గుండె పోటు, పక్షవాత వ్యాధులకు గోల్డెన్ అవర్ లో అత్యాధునిక వైద్య చికిత్స

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, భారతదేశంలోనే మొట్ట మొదటసారిగా తిరువూరు వంటి నగర పంచాయతీలో క్యాథ్ ల్యాబ్ మొదలైన అత్యాధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను స్థానిక అమరావతి హాస్పిటల్ తో కలిసి సంయుక్తంగా “ఆస్టర్ రమేష్ అమరావతి” హాస్పిటల్ ను అందుబాటులోనికి తీసుకువచ్చారు. పరిసర ప్రాంతాలలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సర్వీసులను అందించడానికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ముందుకు వచ్చిందని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేశారు.

అత్యాధునిక క్యాత్ ల్యాబ్, సి.టి.స్కాన్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ మరియు విజయవాడ హాస్పిటల్ నుంచి టెలి ఐ.సి.యు అనుసంధానంతో 20 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను తిరువూరు లో అందుబాటులోనికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అందుబాటులోనికి తీసుకువచ్చింది.

టెలీ ఎమర్జెన్సీ రూమ్, టెలీ ఐ.సీ.యు, టెలీ మెడిసిన్ మరియు టెలీ రేడియాలజీ వంటి అత్యాధునికమైన వైద్య సర్వీసులను 24 గంటలూ తిరువూరులో అందుబాటులోనికి తీసుకు రావడం ద్వారా గోల్డెన్ అవర్ మరియు అర్ధరాత్రి సమయాలలో, సెలవులు మరియు పండుగ వేళల్లో మెరుగైన వైద్య చికిత్సలు మరియు సలహాలు అందించడం ద్వారా 40 శాతం మరణాలను నివారించవచ్చని తెలియ చేసారు.

ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ ఓసిటి,ఐవస్,పేస్ మేకర్,ఎలక్ట్రో ఫిజియాలజీ, పక్షవాత వ్యాధికి అత్యవసర త్రొంబోలైసిస్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి కార్డియాలజీ విభాగంలో డాక్టర్ రామ్ మనోహర్, డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ భరత్ సిద్దార్థ, డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి మరియు డాక్టర్ చంద్రమౌళి వంటి ఆరుగురు సీనియర్ కార్డియాలజిస్టులు మెదడు నరము మరియు ప్రత్యేకమైన మూర్ఛ వ్యాధి నిపుణురాలు డాక్టర్ హరిణి, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ కార్తీక్, సీనియర్ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేశ్ మరియు ప్రముఖ ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు బర్డ్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదేష్ వైద్య సేవలందిస్తారు.

అత్యంత అధునాతనమైన సాంకేతికంగా ఉన్నతమైన 5జి అంబులెన్స్ ను తిరువూరులో ఉంచడం జరుగుతుంది. ముగ్గురు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులతో అత్యవసర పరిస్థితిలో అందించే ప్రాథమిక చికిత్స (బేసిక్ లైఫ్ సపోర్ట్) నందు ఈ ప్రాంతంలో వున్న హెల్త్ కేర్ రంగంలో వున్న ఉద్యోగులకు పోలీస్ వారికి మరియు విద్యార్థులకు తర్ఫిదు అందించడానికి స్కిల్ ల్యాబ్ ను కూడా అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియజేసారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ డైరెక్టర్లు కోనేరు వెంకట కృష్ణన్, శావల దేవదత్, డాక్టర్.కృష్ణ చైతన్య ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ సీ.ఈ.ఓ దేవానంద్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డాక్టర్.ఎం.సి.దాస్,బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *