విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి. కృష్ణబాబు అన్నారు.జాతీయ సికెల్ సెల్ అనీమియా నిర్మూలన ఉద్యమ కార్యక్రమాన్ని శనివారం గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు.నగరంలోని సిద్దార్థ మెడికల్ కళాశాల లెక్చరర్ గ్యాలరీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ముఖ్యకార్యదర్శి యం.టి. కృష్ణబాబు, కమీషనర్ జె. నివాస్, వర్చువల్‌గా హాజరయ్యారు.అనంతరం ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సికిల్‌సెల్ అనీమియా నిర్మూలనకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకుని 2047 సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్రమోది పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో సికెల్ సెల్ అనీమియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల జనాభా లక్ష్యంగా నిర్థారించుకుని స్క్రీనింగ్‌నూరుశాతంచేసేలాకార్యచరణరూపొందించుకున్నామని దీనిలో భాగంగా ఈ ఏడాది 6 లక్షల 50 వేల మందికి స్క్రీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిగిలిన రెండుసంవత్సరంలో నూరు శాతం స్క్రీనింగ్ చేసి ప్రత్యేక కార్డు అందజేయనున్నామన్నారు. రెండు పద్దతులలో స్క్రీనింగ్ చేయనున్నామని వీటిలో ర్యాపిడ్‌కిట్‌తో నిర్థారణ చేయడం హెచ్‌పిఎల్‌సి మిషన్ ద్వారా రక్త నమూనాలు తీసుకుని సికెల్ సెల్ అనీమియా, తలసీమియా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రెండు పద్దతులలో త్వరితగతిన పూర్తి అయ్యే దానిని ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నారు. పాడేరులో జీరో నుండి 40 సంవత్సరాల వయస్సుగల వారికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుందన్నారు. మొదటగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులను తొలి దశలో చేశామన్నారు. మిగిలిన వారిని దశల వారిగా స్క్రీనింగ్ చేసి భవిష్యత్ తరాలు సికెల్ సెల్ అనీమియా బారిన పడకుండా అన్ని చర్యలుతీసుకుంటున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు సికెల్ సెల్ అనీమియా పై ప్రజలలో అవగాహన కల్పించాలని ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య విధాన పరిషత్ కమీషనర్ వెంకటేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వి. రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం సుహాసిని, సిద్దార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. సుధాకర్, ఆరోగ్యశ్రీ కో`ఆర్డినేటర్ జె.సుమన్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …