-జిల్లా జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ అన్నారు.ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలం గ్రామ సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమ క్యాంప్ లో జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న పాల్గొన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి అందాలనదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అర్హత ఉండి వివిధ కారణాలతో లబ్ది చేకూరని వారు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహించే క్యాంపులలో వారికి అవసరమైన దృవ పత్రాలను పొందవచ్చునన్నారు. ప్రజలకు అవసరమైన జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంభ వివాహ దృవీకరణ పత్రాలు, సిసిఆర్‌సి కార్డులు, మొబైల్‌కి ఆధార్ అనుసందానం, కొత్త రేషన్ కార్డు లేదా కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాలు, వివరాలలో మార్పులు, చేర్పులు వంటి 11 రకాల దృవపత్రాలు ఉచితంగా అందజేస్తున్నారన్నారు. జూలై 24వ తేది నుండి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రతీ ఇంటిని సందర్శించి అర్హత ఉన్నప్పటికి లబ్ది పొందని వారిని గుర్తించి, వారి సమస్యలను పరిష్కారానికి కావాల్సిన పత్రాలను సేకరించడం జరిగిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో నిర్వహించే క్యాంపుల ద్వారా ప్రజలు తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవచ్చునన్నారు. తుమ్మలపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న 926 కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తి చేయడం జరిగిందని వీరిలో సమస్యలు ఉన్న 244 మందిని గుర్తించి టోకెన్‌లు జారీ చేయడం జరిగిందన్నారు. నేటి కార్యక్రమంలో 78 వివిధ రకాల సర్టిఫికేట్లను జారీ చేశామని జాయింట్ కలెక్టర్ అన్నారు.ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి పొందిన గుంటుపల్లి, తుమ్మలపాలెం మరియు జూపూడి గ్రామ ప్రజలు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమైందని, నాలుగైదు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని అన్నారు.కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాస్, తుమ్మలపాలెం గ్రామ సర్పంచ్ బొమ్ము వెంకట రమణ, గ్రామ పార్టీ కన్వీనర్ చిట్టి బాబు, తహాశీల్థార్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …