విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో నిర్వహించే శిభిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌లతో కలిసి జగనన్న సురక్ష శిభిరాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్లు సేకరించిన ప్రజా సమస్యలను ఈ శిభిరాల ద్వారా పరిష్కరిస్తున్నారని ప్రజలకు అవసరమైన జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంభ వివాహ దృవీకరణ పత్రాలు, లావాదేవి మ్యుటేషన్లు, సిసిఆర్‌సి కార్డులు, మొబైల్‌కి ఆధార్ అనుసందానం, కొత్త రేషన్ కార్డు లేదా కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాలు, వివరాలలో మార్పులు, చేర్పులు వంటి 11 రకాల దృవపత్రాలు ఉచితంగా అందజేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన రోజువారి సేవలలో ఉన్న అంశాలను కూడా పరిగణంలోకి తీసుకుంటున్నారన్నారు. మండల స్థాయి టీమ్‌లు సందర్శన రోజున హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్‌ను రిజిస్ట్రేషన్ డెస్క్‌ను సంక్షేమ మరియు విద్య సహాయకులు వెరిఫికేషన్ డెస్క్‌ను పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహిస్తున్నారని సర్వీస్ రిక్వస్ట్ డెస్క్‌ను డిజిటల్ సహాయకులు జెకెసి డెస్క్‌ను ఇతర సచివాలయ సిబ్బందితో నిర్వహిస్తున్నారన్నారు. 57వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన శిభిరంలో 1,055 సర్టిఫికేట్లను పంపిణీ చేశారన్నారు. వాలంటీర్లు సేకరించిన సమస్యలతో పాటు తక్షణ పరిష్కారానికి శిభిరాలకు వచ్చి సమస్యను శిభిరాల వద్ద అధికారుల దృష్టికి తీసుకువచ్చిన వారి సమస్యలను కూడా అప్పటికప్పుడు పరిష్కారిస్తారన్నారు. నవరత్నాలలోని పథకాలు పెన్షన్లు వివిధ సంక్షేమ పథకాలు ఆధార్ మొబైల్ లీక్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమస్యలను పదర్శించేందుకు ఆధార్‌కు మొబైల్ లిక్ వంటి అవసరాలకు శిభిరాల వద్ద ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కిట్ల ఏర్పాటు చేయడం వలన ఈ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రతీ ఒక్కరికి అందజేయడంలో అర్హత ఉన్నవారుకూడా కొన్ని సంకేతిక కారణాల వలన మరి ఏ ఇతర కారణాల వలన పథకం లబ్ది అందని వారిని గుర్తించి సచివాలయల వద్ద ఏర్పాటు చేసిన శిభిరాల వద్ద లబ్దిని అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు మున్సిపాలిటి పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి అర్హులైన వారికి ఉచితంగా దృవ పత్రాలు అందజేస్తున్నారన్నారు.ప్లానింగ్‌బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ జగనన్న సురక్ష పథకం ద్వారా అధికారులు ప్రజా అవసరాలు తీర్చడానికి ప్రజలకు అందుబాటులోని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన శిభిరాలు సేవలను సద్వినియోగం చేసుకుని సంక్షేమ పథకాల అమలులో సంకేతిక పరమైన ఇబ్బందులు కాని ఇతర కారణాల వలన లబ్ది చేకూరని వారు అదేవిధంగా సర్టిఫికేట్లు పొందటానికి ఈ శిభిరాలను ఉపయోగించుకోవాలని అన్నారు.అనంతరం శిభిరాల ద్వారా అందజేస్తున్న సర్టిఫికేట్లను జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌లు అందజేశారు.తూర్పు నియోజకవర్గ పరిధిలో వార్డు సచివాలయాలు 15,16,20 సురక్ష క్యాంప్‌లను పరిశీలించిన కలెక్టర్ డిల్లీరావు:`తూర్పు నియోజకవర్గ పరిధిలో 15,16, 20, వార్డు సచివాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిభిరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పర్యవేశించి శిభిరంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని పలు అంశాలపై ఆరా తీశారు. గత 24వ తేది నుండి ఇంటింట సేకరిస్తున్న సమస్యలపై తీసుకున్న చర్యలు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో 167 సర్టిఫికేట్లకు ధరఖాస్తులు సేకరించడం అయిందని నేడు 84 సర్టిఫికేట్లను సంబంధించిన ధరఖాస్తు దారులకు అందజేయడం జరిగిందని సిబ్బంది కలెక్టర్ డిల్లీరావుకు వివరించారు.
కార్యక్రమంలో గ్రామవార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, డిప్యూటి మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, తహాశీల్థార్ మాధురి ఉన్నారు.