-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ధరఖాస్తులను (క్లయిమ్స్)ను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త సవరణ`2024 లో భాగంగా ఓటర్ల చేర్పులు, తొలగింపులు, ఎలక్టరోల్ నవీకరణ, యువ ఓటర్ల నమోదు, తదితర అంశాలపై సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల జాబితాలో ఓటర్ల నమోదు కోసం వస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతోందన్నారు. జిల్లాలో నేటి వరకు 16,00,108 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారన్నారు. ఓటర్ల స్త్రీ పురుష నిష్పత్తి వెయ్యి (1000)కి :1039 గా ఉందన్నారు. జిల్లాలో 18 నుండి 19 సంవత్సరాలు కలిగిన యువతను కొత్తగా 17,557 మందికి ఓటు హక్కు కల్పించామన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ 2023 జనవరి 5 నాటికి ఉన్న 16 లక్షల 31 వేల 883 మంది ఓటర్లలో వలస వెల్లడం, చిరునామా మారడం, మరణించడం, ఫోటో సిమిలర్ ఎంట్రీస్ (పిఎస్‌ఇ) డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ (డిఎస్‌ఇ) తదితర కారణాల తో 51,882 మందిని తొలగించడం జరిగిందన్నారు. జెండర్ రేషియో1039 గాను, పాపులేషన్ రేషియో 680 గా నమోదు చేశామన్నారు. ఫారం -6, 6ఎ, 7, మరియు 8 కు సంబందించి 26,336 ధరఖాస్తులు రాగా వీటిలో 15,925 దరఖాస్తులను అప్‌డేట్ చేశామని, మిగిలిన వాటిని త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. ఈనెల 21వ తేది నుండి ఆగస్టు 21 వరకు బూత్ స్థాయి అధికారులు డోర్ టు డోర్ వెరిఫికేషన్‌కు సిద్దం చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని 7 నియోజకవర్గాలలోని బిఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈనెల 20వ తేదిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
ఈ సమావేశంనకు జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్న దినకర్ పుట్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, డిఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవోలు ఎ రవీంద్రరావు, వైవి ప్రసన్నలక్ష్మి, జడ్పిసిఇవో వి. జ్వోతిబసు, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు, ఎఇఆర్‌వోలు పాల్గొన్నారు.